ఉద్యోగ పరుగులో ఆగిన ఊపిరి

Published on Fri, 01/03/2025 - 05:28

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): ఉద్యోగ పరుగులో ఓ యువకుడి ఊపిరి ఆగిపోయింది. కానిస్టేబుల్‌ సెలక్షన్స్‌లో భాగంగా 1,600 పరుగులో పాల్గొన్న ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం జీలగొండి గ్రామాని­కి చెందిన దరావతు చంద్రశేఖరరావు (21) డిగ్రీ, డీఈడీ పూర్తి చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రశేఖరరావు తండ్రి చనిపోవటంతో తల్లి కష్టపడి చదివించింది. 

అతను ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో డీఎస్సీ(పీఈటీ) కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలోనే కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష పాసయ్యాడు. ఈ క్రమంలో మచిలీపట్నంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ)కు హాజరయ్యాడు. ఇందులో భాగంగా 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గ్రౌండ్‌లో మూడు రౌండ్‌లు పూర్తి చేసిన చంద్ర­శేఖర­రావు... నాలుగో రౌండ్‌ పూర్తి చేయడానికి కొద్ది దూరంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై పక్కకు పడిపోయాడు. 

పోలీసు అధికారులు వెంటనే అతన్ని పక్కకు తప్పించి అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే చంద్రశేఖరరావు మృతిచెందాడు. ఆస్పత్రిలో విగత­జీవిగా ఉన్న కుమారుడిని చూసి ‘నాకింక దిక్కెవ­రయ్యా...’ అంటూ చంద్రశేఖరరావు తల్లి రోదిస్తు­న్న తీరు అక్కడ ఉన్న అందరినీ కలచివేసింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)