Breaking News

తెల్లారితే గృహ ప్రవేశం.. అంతలోనే విషాదం

Published on Mon, 07/15/2024 - 04:30

విడపనకల్లు : తెల్లారితే నూతన గృహ ప్రవేశం.. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. పాత మిద్దె కూలి భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగి ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామస్తులు, పోలీసు­లు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కోనప్పగారి మారెప్ప(42), లక్ష్మి(38) దంపతులు. వీరికి అంజి, హేమంత్‌ అనే ఇద్దరు కుమారులు, కుమార్తె మానస(మూగ) ఉన్నారు. మారె­ప్ప పెద్దలు దాదాపు 60 ఏళ్ల క్రితం మట్టితో కట్టించిన ఇంట్లోనే ఉండేవారు. 

అయితే.. భార్యాభర్త కాయాకష్టం చేసుకుని సంపాదించిన డబ్బుతో ఇటీవల నూతన గృహాన్ని నిరి్మంచుకున్నారు. ఆదివారం గృహ ప్రవేశం పెట్టుకున్నారు. కాగా, శనివారం రాత్రి భారీ గాలులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది. రోజూ మాదిరిగానే మారెప్ప, లక్ష్మి దంపతులు కుమార్తెతో కలసి పాత మట్టి మిద్దెలో పడుకున్నారు. వీరితో పాటు లక్ష్మి తమ్ముడు రాము కూడా అదే ఇంట్లో నిద్రించాడు. ఇద్దరు కుమారులు మాత్రం ఇంటి ఆరుబయట మంచంపై పడుకున్నారు. వర్షానికి తడిసిన కారణంగా మట్టి మిద్దె ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. 

పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కి పడి లేచారు. మారెప్ప ఇల్లు కూలిపోయిందని గమనించి అరుపులు, కేకలు వేయడంతో కాలనీవాసులంతా వచ్చి మట్టి కింద పూడుకునిపోయిన వారిని వెలికి తీశారు. అప్పటికే మారెప్ప, భార్య లక్ష్మి ప్రాణాలు విడిచారు. కుమార్తె మానసకు చేయి విరిగింది. రాముకు చేతులు, వేళ్లు విరగడంతో పాటు తలకు బలమైన గాయమైంది. గాయపడిన వారిని 108లో ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఘటనపై ఎస్‌ఐ ఖాజా హుస్సేన్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)