పాఠశాలకు వెళ్లిన తొలిరోజే.. చిన్నారి ప్రాణం తీసిన స్కూల్‌ బస్సు

Published on Fri, 07/04/2025 - 22:07

సాక్షి,నంద్యాల జిల్లా: తల్లిదండ్రులారా.. తస్మాత్ జాగ్రత్త! మీ పిల్లల భద్రత మీ చేతుల్లోనే ఉంది. బస్సులో స్కూల్‌కు వెళ్లే సమయంలో, వచ్చే సమయంలో ప్రతి క్షణం అప్రమత్తత అవసరం. ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్న నిండు ప్రాణాల్ని కోల్పోవాల్సి వస్తుంది.    

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన తొలిరోజే చిన్నారిని స్కూల్‌ బస్సు ప్రాణం తీసింది. పోలీసుల వివరాల మేరకు.. ఆళ్లగడ్డలో ఎంవీ నగర్‌కు చెందిన శ్రీధర్‌, వనజ దంపతుల కుమార్తె హరిప్రియ(5). ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. ఈక్రమంలో ఇవాళే తొలి రోజు స్కూల్‌కు వెళ్లింది. అనంతరం స్కూల్‌ బస్సులో ఇంటికి వచ్చింది.

అయితే చిన్నారి బస్సు దిగి ముందు నుంచి ఇంటి వైపుకు వెళ్లే ప్రయత్నం చేసింది. అప్పుడే ఘోరం జరిగింది. బస్సు ముందు నుంచి హరిప్రియ ఇంటికి వెళుతున్న విషయాన్ని పట్టించుకోలేదు. ముందుకు పోనిచ్చాడు. దీంతో బాలిక బస్సు చకక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. బాలిక ప్రాణాలు కోల్పోవడంతో ఎంవీ నగర్‌లో విషాదం నెలకొంది. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)