Breaking News

పిడుగుపాటుకు ముగ్గురు బలి

Published on Wed, 09/25/2024 - 04:23

దమ్మపేట/హుజూరాబాద్‌ రూరల్‌/లోకేశ్వరం: భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌ జిల్లాల్లో పిడుగుల కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. భద్రాద్రిజిల్లా దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీ పరిధి బూర్గుగుంపు గ్రామానికి చెందిన కట్టం నాగశ్రీ (21), సున్నం అనూష (23) మరికొందరితో కలిసి జగ్గారం శివారు అరటి తోటలో కూలి పనికి వెళ్లారు. 

మధ్యాహ్నం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో త్వరగా పనులు ముగించుకొని బయలుదేరిన క్రమంలో వారు నిల్చున్న చోటే పిడుగు పడింది.దీంతో నాగశ్రీ, అనూష ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. సీతమ్మ, ఊకే రత్తమ్మ, కల్లూరి రాజమ్మ తీవ్ర అస్వస్థతకు గురికాగా సత్తుపల్లి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. 

మరోఘటనలో కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన రైతు కంకణాల కృష్ణకుమార్‌ (33) పిడుగుపాటుతో మృతిచెందాడు. కృష్ణకుమార్‌ తన పాడి గేదెలను తీసుకొని గ్రామ శివారులోని మైదానంలో మేపుతుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురికావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. 

పిడుగుపాటుకు కాడెడ్లు మృతి 
నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలం రాయాపూర్‌ కాండ్లీకి చెందిన రైతు ఆరె లింగురాం పటేల్‌కు చెందిన కాడెడ్లు, లేగదూడ సోమవారం రాత్రి పిడుగుపాటుతో మృతిచెందాయి. లింగురాం తనకున్న ఐదెకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా పంటలు సాగుచేశాడు. 

సోమవారం ఉదయం కాడెడ్లను చేను వద్దకు తీసుకెళ్లాడు. పనులు పూర్తయ్యాక సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటిపక్కనే వాటిని కట్టేసి రాత్రి నిద్రపోయాడు. అర్ధరాత్రి పిడుగు పడటంతో కాడెడ్లతోపాటు లేగదూడ మరణించాయి. ఆర్‌ఐ బాలకిషన్‌ పంచనామా నిర్వహించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)