Breaking News

బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం

Published on Mon, 08/19/2024 - 05:31

డెహ్రడూన్‌: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌ రోడ్‌వేస్‌కు చెందిన బస్సులో డెహ్రడూన్‌లోని అంతర్రాష్ట్ర బస్‌ టెర్మినల్‌ (ఐఎస్‌బీటీ)లో ఇద్దరు డ్రైవర్లు, సహా మరో ముగ్గురు ఆగస్టు 12వ తేదీన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 13వ తేదీ తెల్లవారుజామున బస్‌ టెర్మినల్‌లోని ఓ దుకాణం వద్ద బాలికను గార్డు గుర్తించాడు. వెంటనే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. 

చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ఉత్తరాఖండ్‌ రోడ్‌ వేస్‌ బస్సును గుర్తించారు. ఐదుగురిని అరెస్టు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నేరం జరిగిన బస్సు, మరో బస్సును దర్యాప్తు కోసం ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపించారు. 

మానసికంగా స్థిమితంగా లేని బాలిక సరైన సమాచారం ఇవ్వలేదు. తనది యూపీలోని మొరాదాబాద్‌ అని తెలిపింది. కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించింది. మొరాదాబాద్‌ నుంచి ఢిల్లీకి, ఢిల్లీలోని కశ్మీరీ గేట్‌ నుంచి బస్సులో డెహ్రడూన్‌కు వచ్చానని, అక్కడ ఐదుగురు వ్యక్తులు తనపై ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక చెప్పిందని డెహ్రాడూన్‌ ఎస్‌ఎస్పీ అజయ్‌ సింగ్‌ తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశామని చెప్పారు. 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)