Breaking News

చిచ్చు రేపిన ఇంటి స్థలం.. తల్లి, తమ్ముడి హత్య

Published on Tue, 06/29/2021 - 08:50

ఆత్మకూర్‌ (ఎస్‌): ఇంటి స్థల వివాదం ఓ కుటుంబంలో ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆగ్రహావేశంతో ఊగిపోయిన ఓ వ్యక్తి తల్లిని, సోదరుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌.ఎస్‌ మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కందగట్ల గ్రామం బుడిగె జంగాల కాలనీకి చెందిన తూర్పటి ఎర్ర కిష్టయ్య, మరియమ్మ (70) దంపతులకు ఐదుగురు సంతానం. ఆస్తుల పంపకాలన్నీ పూర్తయ్యాయి. చిన్న కుమారుడు శ్రీనుకు భార్య లేకపోవడంతో తల్లి వద్దనే ఉంటున్నాడు. సోదరులు లక్ష్మయ్య, శ్రీను (27)ల మధ్య తండ్రి ఇచ్చిన స్థలం విషయంలో కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది.

ఈ విషయమై సోమవారం రాత్రి చోటుచేసుకున్న చిన్నపాటి గొడవ.. ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన లక్ష్మయ్య.. తమ్ముడు శ్రీనుపై దాడి చేసేందుకు పందులను వేటాడే బల్లెంతో వెళ్లాడు. తల్లి మరియమ్మ అడ్డుపడేందుకు యత్నించగా.. ఆ బల్లెం తగిలి విలవిల్లాడుతూ ప్రాణాలొదిలింది. వెంటనే శ్రీనును కూడా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. 

చదవండి: స్థల వివాదం; వెంటాడి.. వివస్త్రను చేసి  

#

Tags : 1

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)