Breaking News

యడియూరప్పపై పోక్సో కేసు

Published on Sat, 03/16/2024 - 05:09

సాక్షి, బెంగళూరు: బీజేపీ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప(81)పై పోక్సో కేసు నమోదైంది. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు యడియూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 354ఏ కింద కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీన 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆమె తల్లి గురువారం రాత్రి ఫిర్యాదు చేసిందని బెంగళూరు పోలీసులు తెలిపారు.  ఈ ఆరోపణలను యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. చట్టపరంగా ముందుకు వెళతానన్నారు.

పోలీసులు డాలర్స్‌ కాలనీలోని యడియూరప్ప నివాసానికి వెళ్లి ఆయన నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారని డీజీపీ అలోక్‌ మోహన్‌ శుక్రవారం చెప్పారు. తదుపరి దర్యాప్తు కోసం వెంటనే కేసును సీఐడీకి అప్పగించామన్నారు.ఈ పరిణామంపై హోం మంత్రి జి.పరమేశ్వర మాట్లాడారు. బాధితురాలి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదని కొందరు చెప్పారన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన తల్లితో కలిసి యడియూరప్పను ఆయన నివాసంలో కలవడానికి వెళ్లినప్పుడు బాలిక చిత్రీకరించిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి.  

ఆమె ఏడుస్తూ సాయం అర్థించింది
కేసు నమోదు కావడంపై యడియూరప్ప స్పందించారు. ఈ కేసుకు సంబంధించి చట్ట పరంగా ముందుకెళతానన్నారు. ‘ఆ మహిళ ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది. ఆమెను లోపలికి రమ్మని చెప్పి, సమస్య తెలుసుకున్నా. ఆ వెంటనే పోలీస్‌ కమిషనర్‌ దయానందతో ఫోన్‌లో మాట్లాడి, ఆమెకు న్యాయం చేయాలని కోరా. ఆ వెంటనే ఆమె నన్ను విమర్శించడం మొదలుపెట్టింది. దీంతో, ఏదో తేడాగా ఉందని అనుమానం వచ్చింది’అని చెప్పారు. ఆమె పోలీస్‌ కమిషనర్‌ను కలిశాక, వ్యవహారం మలుపు తిరిగిందని పేర్కొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)