ఎస్‌ఐ నా భార్యా పిల్లలను దూరం చేశారు.. సెల్ఫీ సూసైడ్‌ కలకలం..

Published on Sat, 03/04/2023 - 18:49

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో సెల్ఫీ సూసైడ్ యత్నం ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ సీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్ఐ బాబూరావు వేధింపులు భరించలేకపోతున్నానంటూ క్రాంతికుమార్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేశాడు. రూ.7 లక్షల రూపాయల నగదు, మూడున్నర తులాల బంగారం తీసుకుని ఎస్ఐ బాబూరావు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సూసైడ్‌ యత్నానికి ముందు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో  పెట్టాడు.

భార్యా భర్తల మధ్య విబేధాలు సృష్టించి.. తన భార్యను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశాడు. భార్యా పిల్లలకు తనను దూరం చేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు క్రాంతి. న్యాల్ కల్ రోడ్ఖులో ఓ పోలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసే ముందు.. డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయగా.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

ఎస్ఐ బాబూరావు అన్న కూతురినే క్రాంతి పెళ్లి చేసుకోగా.. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతో ఎస్‌ఐ బాబూరావు మధ్యవర్తిత్వం చేస్తుండటంతో విషయం ముదిరింది. బాన్సువాడకు చెందిన క్రాంతి నిజామాబాద్‌లోని గాయత్రీనగర్‌లో ఉంటున్నాడు. క్రాంతి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
చదవండి: నా పెళ్లి సంబంధం చెడగొట్టారు.. యువతి సూసైడ్‌ నోట్‌ రాసి..

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)