Breaking News

రూ.8 లక్షల విలువైన గంజాయి పట్టివేత 

Published on Mon, 03/04/2024 - 04:04

ఆనందపురం (విశాఖ జిల్లా):  కంటెయినర్‌లో తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన గంజాయిని ఆనందపురం పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ–1 విజయ్‌ మణికంఠ ఆదివారం ఆనందపురం పోలీస్‌ స్టేషన్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. జేసీపీ స్పేర్‌ పార్టుల లోడుతో  హరియాణ వెళ్లడానికి బయలుదేరిన కంటెయినర్‌లో గంజాయి రవాణా జరుగుతోందని శ్రీకాకుళం పోలీసులకు సమాచారం అందించింది. అక్కడ చెక్‌ పోస్టు వద్ద కంటెయినర్‌ను ఆపి తనిఖీ చేస్తుండగా అక్కడ సిబ్బందిని,  డివైడర్‌ను ఢీకొట్టి కంటైనర్‌ను ముందుకు దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విజయనగరం, విశాఖ పరిధిలోని అన్ని చెక్‌ పోస్టులకు సమాచారమిచ్చారు.

ఈ మేరకు ఆనందపురం పోలీసులు భీమిలి క్రాస్‌ రోడ్డు వద్ద కంటెయినర్‌ను ఆపేందుకు యత్ని0చగా.. కంటైనర్‌ను ఆపకుండా ముందుకు పోనిచ్చారు. పోలీసు సిబ్బంది మోటార్‌ బైక్‌ల సాయంతో సినీ ఫక్కీలో వెంబడించి బోయిపాలెం సమీపంలో కంటెయినర్‌ను నిలువరించారు. ఈ లోగా కంటెయినర్‌లో ఉన్న వారు పరారయ్యారు. సీఐ టీవీ తిరుపతిరావు కంటెయినర్‌ తాళాలను పగలుగొట్టి లోపల పరిశీలించారు.

అందులో స్పేర్‌ పార్టులతో పాటు 13 గంజాయి బ్యాగ్‌లు బయటపడ్డాయి. దీంతో కంటెయినర్‌ను ఆనందపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. డీసీపీ–1 విజయ్‌ మణికంఠ, ఏసీపీ(నార్త్‌) సునీల్‌లు కంటెయినర్‌ను పరిశీలించి 13 బ్యాగ్‌లలో ఉన్న 80 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 386 కిలోల గంజా­యి విలువ రూ.8 లక్షలుగా తేల్చారు. గంజాయిని ఒడిశాలో లోడు చేసినట్టు సమాచారం ఉందని, నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ విజయ్‌
మణికంఠ చెప్పారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)