Breaking News

Bolarum Cantonment Hospital: బోర్డుదే బాధ్యత

Published on Thu, 05/23/2024 - 07:36

రసూల్‌పురా: బొల్లారం కంటోన్మెంట్‌ జనరల్‌ ఆసుపత్రిలో ఆవరణలో చెట్టు కూలి మృతి చెందిన తూంకుంట నివాసి రవీందర్‌ కుటుంబానికి కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు న్యాయం చేయాలని కోరుతూ బంధువులు, కుటుంబ సభ్యులు బుధవారం ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఎండిన చెట్టు తొలగించడంలో బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయ పడిన రవీందర్‌ సతీమణి సరళాదేవి ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్‌లోనే ఉండి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తిరుమలగిరి మండల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మద్దతు పలికి ఆందోళనలో పాల్గొన్నారు.

 దీనిపై సమాచారం అందుకున్న బోర్డు సీఈవో మధుకర్‌ నాయక్‌ తమ తరపున ప్రతినిధులుగా వాటర్‌వర్క్స్‌ సూపరిటెండెంట్‌ రాజ్‌కుమార్, నర్సింగ్‌ రావు, యాని, రమణ, రాములును ఆస్పత్రికి పంపించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ బోర్డు అధికారులు ఘటనకు బాధ్యత వహించి రవీందర్‌ ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేయాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యంవల్లే రవీందర్‌ మృతి చెందాడని ఆరోపించారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని ఆస్పత్రి ముందు, మీటింగ్‌ హాల్లో, సూపరింటెండెంట్‌ రామకృష్ణ వద్ద నాలుగు గంటల పాటు నిరసనకు దిగారు. ఒక దశలో ఉపాధ్యాయులు అధికారి రాజ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. 

అధికారుల హామీతో ఆందోళన విరమణ  
ఈ విషయంలో నిర్ణయం తీసుకునే వీలు తమకు లేదని, బోర్డు పాలకమండలి సమావేశంలో చర్చించి రవీందర్‌ కుటుంబానికి, వారి ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేసేందుకు తగిన నిర్ణయం తీసుకుంటామని వాటర్‌వర్క్స్‌ అధికారి రాజ్‌కుమార్‌ హామీచ్చారు. అదే విధంగా తీవ్రంగా గాయపడిన సరళాదేవికి కిమ్స్‌ హాస్పిటల్‌లో మెరుగైన చికిత్స అందజేస్తామని, ఆ ఖర్చు మొత్తం బోర్డు భరిస్తుందని, బొల్లారం హస్పిటల్‌ నుంచి ఓ డాక్టర్‌ను కిమ్స్‌ ఆసుపత్రికి సరళాదేవితో పంపిస్తామని అధికారులు హామీచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)