Breaking News

హనీట్రాప్‌ చేసి.. కత్తులతో పొడిచి

Published on Fri, 02/09/2024 - 04:27

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): పాత కక్షల నేపథ్యంలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని 10 మంది కలిసి దారుణంగా హత్య చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము (36) గతంలో ఆటోడ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి దిగాడు. కొద్ది రోజులు కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన రాము ఇటీవల బీజేపీలో చేరి వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు.

హైదరాబాద్‌ చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న సమయంలో రాముకు జీడిమెట్లకు చెందిన మణికంఠ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రియల్‌ఎస్టేట్‌ లావాదేవీలు చేసేవారు. అయితే వారి మధ్యలో వ్యాపారం విషయంలో గొడవలు జరిగి ఒకరిపై ఒకరు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. పరిస్థితులు ముదిరిపోవడంతో రాము హత్యకు మణికంఠ పథకం వేశాడు. గత రెండు రోజుల నుంచి రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన రాము యూసుఫ్‌గూడలోని ఎల్‌ఎన్‌నగర్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న మణికంఠ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ యువతితో ఫోన్‌ చేయించి హానీట్రాప్‌ చేయించాడు.

ఆ యువతి ఫోన్‌కాల్‌ నమ్మిన రాము రాత్రి 10 గంటల సమయంలో ఎల్‌ఎన్‌నగర్‌లోని తన ఇంటికి వచ్చాడు. సరిగ్గా 11.15 గంటలకు మణికంఠతో పాటు బోరబండకు చెందిన జిలానీ అనే రౌడీïÙటర్, మరో ఎనిమిది మంది కలిసి ఇంట్లోకి చొరబడి రామును కత్తులతో 50 పోట్లు పొడిచారు. అరగంట పెనుగులాడిన అనంతరం రాము కన్నుమూశాడు. రామును మర్డర్‌ చేసిన తరువాత ఆ దృశ్యాలను మణికంఠ ఓ స్నేహితుడికి వీడియో కాల్‌ చేసి చూపించాడు. రామును హనీట్రాప్‌ చేసిన యువతిని జూబ్లీహి ల్స్‌ పోలీసులు విచారిస్తున్నారు.

మణికంఠతో పాటు పారిపోయిన మిగతా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్డర్‌ జరిగిన సమయంలో అక్కడ ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లుగా పోలీసులు అను మానిస్తున్నారు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలు స్వగ్రా మంలో ఉంటుండగా, విషయం తెలియగానే ఆమె గురువారం జూబ్లీహిల్స్‌పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు