Breaking News

మాదాపూర్‌లో రేవ్‌ పార్టీ.. ఐదుగురు అరెస్ట్‌

Published on Fri, 07/26/2024 - 04:52

హఫీజ్‌పేట్‌: మాదాపూర్‌లో రేవ్‌ పారీ్టపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) అధికారులు దాడి చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జాయింట్‌ కమిషనర్‌ కె.వై.ఖురేషి, ఎస్‌టీఎఫ్‌ సూపరింటెండెంట్‌ ప్రదీప్‌రావు గురువారం శేరిలింగంపల్లి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. బేగంపేటకు చెందిన నాగరాజు యాదవ్‌ (31) ఆధ్వర్యంలో మాదాపూర్‌ సైబర్‌ టవర్స్‌ వెనక ఉన్న క్లౌడ్‌ 9 హోమ్స్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్స్‌లో జన్మదిన వేడుకల్లో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేశారు.

ఈ నెల 12న నాగరాజు గోవా నుంచి 3 గ్రాముల కొకైన్‌ను తెప్పించి మోకిలకు చెందిన నితిన్‌ (24)కు అందించాడు. బేగంపేటకు చెందిన సాయికుమార్‌ యాదవ్‌ (27) విదేశాల నుంచి మద్యం తీసుకురాగా, బంజారాహిల్స్‌కు చెందిన సీహెచ్‌ కిషోర్‌ (28) రేవ్‌పార్టీకి కోసం సరీ్వస్‌ అపార్ట్‌మెంట్‌ బుక్‌ చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి ఎస్‌ఐలు బాల్‌రాజ్, సంధ్యల బృందం రేవ్‌పార్టీపై దాడి చేసి 14 మంది యువకులు, 6 మంది యువతులను అదుపులోకి తీసుకుంది.

వారి నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువ చేసే కొకైన్‌ (1 గ్రాము), ఎండీఎంఏ (2 గ్రాములు), ఓజీ కుష్‌(1 గ్రాము)తోపాటు 12 విదేశీ మద్యం సీసాలు, 36 బీర్‌ సీసాలు, ఒక ఇన్నోవా కారును స్వా«దీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహించిన నాగరాజుతోపాటు మత్తుపదార్థాలు సరఫరా చేసిన సాయికుమార్‌ యాదవ్, ఇమాన్యుల్, సీహెచ్‌ కిషోర్, నితిన్‌లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మిగతా 15 మందిని కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు. రేవ్‌పారీ్టలో పట్టుబడ్డ ఐదుగురు యువకులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎబాన్‌ యూరిన్‌ టెస్ట్‌ అనే నూతన పరికరంతో పరీక్షలు చేశారు. ఈ పరీక్షతో కేవలం 5 నిమిషాల్లోనే సదరు వ్యక్తి డ్రగ్స్‌ తీసుకున్నాడో లేదో తెలుసుకోవచ్చు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)