Breaking News

ఈ బల్లులు అమ్మితే.. ఏడేళ్ల జైలు శిక్ష?

Published on Sat, 04/12/2025 - 16:51

రెండు తలల పాము,  ఆకర్షించే చెంబు, ‘ఇదొక కదిలే యత్రం.. ఇది చదివే మంత్రం’, రైస్‌ పుల్లింగ్‌, యాంటిక్ పీస్‌లు అంటూ జనాన్ని బురిడీ కొట్టించి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్న గ్యాంగ్ లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి.  ఈ తరహా మోసాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ అలవాటు పడ్డ ప్రాణం దాన్ని ఎలా వదలుకుంటుంది అన్నట్లు కొందరు దీన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

అవి అరుదైనవి అని చెబుతూ, వాటికి మంత్ర  శక్తి ఉందని చెబుతూ, ఇది ఉంటే మీరు కోట్లకు పడగలెత్త వచ్చు అంటూ అమాయక ప్రజల్ని మోసానికి గురి చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.. గత దశాబ్ద కాలంలో ఈ తరహా మోసాలు చాలా ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు వెర్రి తలలు వేసుకుని వీటిని కొనుగోలు చేస్తూ భారీగా మోసపోతూనే ఉన్నారు. 

ఇదే తరహాలో అరుదైన బల్లులను అమ్మబోయి ఒక గ్యాంగ్ పోలీస్ లకు పట్టుబడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అస్సాం రాష్ట్రంలోని  దిబ్రుగర్హ్ లో అరుదైన బల్లి జాతిగా పేర్కొనబడే  టోకే గెక్కో కు చెందిన 11 బల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ముఠాగా ఏర్పడిన కొందరు వీటిని అమ్మడానికి యత్నించే క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై పోలీసులకు ముందస్తు సమాచారం ఉండటంతో వారిని వలవేసి చాకచక్యంగా పట్టుకున్నారు.  వీటిని అమ్మే ముగ్గురు స్మగ్లర్లను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ. 60 లక్షలకు బేరం పెట్టుకుని వీటిని అమ్మడానికి యత్నించే సమయంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అంతరించిపోతున్న బల్లి జాతిగా 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టంలో పేర్కొనడంతో దీన్ని పట్టుకోవడం, అమ్మడం నేరం కిందకు వస్తుంది.

నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష
ఈ బల్లులను అమ్మకానికి పెట్టడం తీవ్ర నేరం కనుక, ఒకవేళ వారు నేరం చేసినట్లు రుజువైతే ఏడేళ్ల వరకూ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అత్యంత అరుదుగా కనిపించే ఈ బల్లులు.. భారత్ లో మాత్రం అస్సాం, అరుణాచల్ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి.  వీటిని అక్రమంగా రవాణా చేస్తూ  ఆగ్నేసియాలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. వీటికి అక్కడ ఎక్కువ డిమాండ్ ఉండటంతో  అక్కడకు దొడ్డిదారిన తరలిస్తూ ఉంటారు.

ఈ స్మగ్లింగ్ కు పాల్పడిన వారు దేబాశిస్ దోహుతియా(34), మనాష్ దోహుతియా(28), దిపాంకర్(40)లుగా దర్యాప్తులో వెల్లడైంది.  ఆ బల్లులను వారు అరుణాచల్ ప్రదేశ్ నుండి తెచ్చినట్లు సిట్ విచారణ సందర్భంగా స్పష్టం చేశారు. ఒక్కో బల్లిని రూ. 60 లక్షలకు అమ్మకానికి పెట్టినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ లోని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

ఇదొక అరుదైన బల్లి జాతి
టోకే గెక్కో అనేది పశ్చిమాసియా ప్రాంతంలో కనిపించే అరుదైన బల్లి జాతి. ఇది పెద్దవిగా ఉండటమే కాదు.. వివిధ రంగుల్లో ఉంటాయి. ఇవి రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ ఉంటాయి. దీన్ని చాలా చోట్ల అదృష్టంగా భావిస్తూ ఉండటంతో వాటికి డిమాండ్ లక్షల్లో ఉంటుంది. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)