ఫ్రీగా ఫోన్‌ అని ఆశ చూపి.. బాలికను గదిలోకి తీసుకెళ్లి

Published on Sun, 08/13/2023 - 16:49

జైపూర్‌: ప్రజలకు సేవలందిస్తూ మంచిపేరుతో పాటు వార్తల్లో నిలుస్తుంటారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే మరికొందరు మాత్రం లంచాలు, అక్రమాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ తరహాలోనే ఓ ఉద్యోగి బాలికపై అత్యాచారాని పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. 

వివరాల ప్రకారం.. రాజస్థాన్ ప్రభుత్వం మహిళలు, బాలికలకు ఉచితంగా మొబైల్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ప్రతి నగరంలో మొబైల్‌లను ఇచ్చేందుకు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. సునీల్‌ కుమార్‌ జన్‌గిడ్‌ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ విభాగంలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. తోడాభిమ్‌ ప్రాంతానికి చెందిన బాలిక తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అతని తల్లి ఏదో పని మీద బయటకు వెళ్ళింది, తండ్రి జైపూర్ వెళ్ళాడు.

ఈ విషయం సునీల్‌కు తెలియడంతో బాలిక ఇంటికి వెళ్లాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మొబైల్ ఇస్తోందని చెప్పి తనతో పాటు రావాలని చెప్పి..  ఆమెను తన వాహనంపై ఎక్కించుకుని దగ్గరల్లోని ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఈద్గా మార్గంలో వదిలేశాడు. గాయాలతో ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు  తెలిపారు. అత్యాచారాన్ని వ్యతిరేకించినందుకు క్యాషియర్ తనను కూడా కత్తితో పొడిచి గాయపరిచాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది.

చదవండి    వాడే కావాలి.. పెళ్లైన ప్రియుడితో బలవంతగా తాళి కట్టించుకున్న యువతి!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)