ప్రియుని కోసం కన్నకొడుకు గొంతు కోసి..

Published on Wed, 07/29/2026 - 10:37

మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఓ కన్నతల్లి తన మూడేళ్ల పసికందును అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో మాట్లాడుతుండగా ఏడుస్తున్నాడనే కారణంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది. బల్దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛౌలీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఛౌలీ గ్రామానికి చెందిన కృష్ణ మురారి గుప్తా భార్య రుచి జిందల్ (32) వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. జూన్ 28న భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆ సమయంలో మూడేళ్ల కుమారుడు మాధవ్ పదే పదే ఏడుస్తూ ఆమెకు అడ్డుగా మారాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ తల్లి, బిడ్డ గొంతు నులిమి హత్య చేసింది.

ఈ దారుణం తర్వాత ఆమె ఏమీ ఎరుగనట్లు నాటకం మాడింది. బిడ్డకు అకస్మాత్తుగా అనారోగ్యం చేసిందంటూ భర్తకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. పోలియో చుక్కల వికటించడం వల్లే మృతి చెంది ఉండవచ్చని భావించి, బాలుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

అయితే, సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే జూలై 27న భర్త కృష్ణ మురారి తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె ఫోన్ కాల్స్ పరిశీలించారు. ఆ సమయంలో ఆమె తన ప్రియుడితో మాట్లాడుతున్న సంభాషణను ఆయన విన్నారు. నిలదీయడంతో రుచి జిందల్ తన తప్పును అంగీకరించింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బల్దేవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని, కోర్టు ఆదేశాల మేరకు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు మహావన్ సీఓ సంజీవ్ కుమార్ రాయ్ తెలిపారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)