రూ.1200 బిల్‌ లొల్లి.. కరెంట్‌ కట్‌ చేశాడని.. లైన్‌మన్‌పై పెట్రోల్‌ పోసి..

Published on Sun, 07/02/2023 - 03:40

గజ్వేల్‌ రూరల్‌: బిల్లు చెల్లించలేదని ఇంటి విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించిన జూనియర్‌ లైన్‌మన్‌పై వినియో గదారుడు పెట్రోల్‌ పోశాడు. గజ్వేల్‌ మున్సి పాలిటీ పరిధిలోని క్యాసారంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై విద్యుత్‌ శాఖాధికారులు, వినియోగదా రుని కుటుంబ సభ్యులు, గజ్వేల్‌ పోలీసు లు తెలిపిన వివరాలివి. క్యాసారంలోని 2వ వార్డుకు చెందిన సుంకరి కరుణాకర్‌ ఇంటికి 2 నెలలకు రూ.1,200 బిల్లు వచ్చింది.

ఇటీవల జూనియర్‌ లైన్‌మన్‌ నరేష్‌ తన విధుల్లో భాగంగా కరుణాకర్‌ను బిల్లు చెల్లించాల ని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇదే విషయాన్ని జేఎల్‌ఎం నరేశ్‌ విద్యుత్‌శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. శనివారం విద్యు త్‌ స్తంభం ఎక్కి కరుణాకర్‌ ఇంటికి కనెక్షన్‌ తొలగించాడు. దీంతో అసహనానికి గురైన కరుణాకర్‌ తన ద్విచక్ర వాహనంలోని పెట్రోల్‌ తీసి నరేశ్‌పై పోసి అగ్గిపెట్టె తీయడంతో అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.

దీంతో నరేశ్‌ ఈ విషయాన్ని విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తనపై హ త్యాయత్నం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్‌ తెలిపారు. కాగా తమకు జీతం రాలేదని, రెండుమూడు రోజుల్లో చెల్లిస్తామని చెప్పినప్పటికీ నరేష్‌ వినకుండా విద్యుత్‌ సరఫరాను తొలగించినట్లు కరుణాకర్‌ భార్య కావ్య పేర్కొన్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)