Breaking News

మేడ్చల్‌: ప్రియుడి ఇంట్లో ప్రియురాలి ఆత్మహత్య!

Published on Sat, 05/27/2023 - 13:09

సాక్షి, క్రైమ్‌:  మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా జవహార్ నగర్‌లో ఘోరం చోటు చేసుకుంది. ప్రియుడి ఇంట్లోనే ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. 

మెహిదీపట్నంలో నివాసం ఉంటున్న పూజ.. చైతన్యపురిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. ఈ క్రమంలో జవహర్ నగర్ యాప్రాల్‌కి చెందిన దయాకర్‌తో పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారింది. అయితే ఆ విషయం తెలిసి దయాకర్‌ తల్లి ఇద్దరినీ మందలించింది. కూతురిని హద్దులో పెట్టుకోవాలంటూ పూజ పేరెంట్స్‌ను బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో.. 

పూజను ఇంటికి తీసుకెళ్లి మరీ తల్లిని ఒప్పించాలని దయాకర్‌ ప్రయత్నించాడు. ఆ సమయంలో దయాకర్‌కి, అతని తల్లికి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే తాను పూజను వివాహం చేసుకోనని దయాకర్‌ తెగేసి చెప్పడం.. ఊహించని ఆ పరిణామంతో పూజ షాక్‌కు గురైంది. ఆపై ఓ గదిలోకి పరిగెత్తి గడియ పెట్టుకుంది. ఎంతకీ ఆమె తలుపు తీయకపోవడంతో.. బద్ధలు కొట్టి చూడగా పూజ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. విషయం పోలీసులకు చేరడంతో వాళ్లు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం.. పూజ పేరెంట్స్‌ ఫిర్యాదుతో దయాకర్‌తో పాటు అతని తల్లిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

#

Tags : 1

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)