Breaking News

ఫిల్మ్ నగర్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Published on Mon, 12/30/2024 - 07:50

ఫిలింనగర్‌: నూతన సంవత్సర వేడుకల వేళ ఫిలింనగర్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఇద్దరు డ్రగ్స్‌ పెడ్లర్స్‌తో పాటు ఓ కొనుగోలుదారును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. షేక్‌పేటలోని ఫాల్కన్‌ కాలనీలో నివసించే ఎండీ అబ్దుల్‌ ఇర్ఫాన్‌ కారు డీలర్‌గా పని చేస్తున్నాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి షేక్‌ మహ్మద్‌ రెహమాన్‌ అలీ న్యూ ఇయర్‌ వేడుకలకు అవసరమైన వారికి డ్రగ్స్‌ విక్రయించేందుకు ముంబై నుంచి ఇటీవలే ఎండీఎంఏ డ్రగ్స్‌ను నగరానికి తీసుకువచ్చాడు. ఇర్ఫాన్‌తో కలిసి నాలుగు రోజుల పాటు డ్రగ్స్‌ విక్రయించాలని పథకం వేశాడు. 

ఇందులో భాగంగానే ఫిలింనగర్‌లోని కొత్త చెరువు వద్దకు రెహమాన్‌ అలీ చేరుకుని మరో పెడ్లర్‌ ఇర్ఫాన్‌ను అక్కడికి పిలిపించాడు. అవసరమైన వారికి సరుకును విక్రయించే క్రమంలో బహదూర్‌పురాకు చెందిన సయ్యద్‌ హజ్మతుల్లాను పిలిపించారు. కొత్త చెరువు వద్ద వీరిద్దరూ కలిసి హజ్మతుల్లాకు డ్రగ్స్‌ ఇచ్చే క్రమంలో అప్పటికే సమాచారం అందుకున్న ఫిలింనగర్‌ పోలీసులు అక్కడికి చేరుకుని వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

 రెహమాన్‌ అలీ ఇటీవలే డ్రగ్స్‌ను ముంబై నుంచి తీసుకు వచ్చినట్లుగా తేల్చారు. ఇర్ఫాన్‌తో కలిసి డ్రగ్స్‌ను విక్రయించాలని పథకం వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కొనుగోలు చేయడానికి వచి్చన హజ్మతుల్లాతో పాటు వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఫిలింనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)