Breaking News

తిరగబడ్డ దోపిడీ దొంగలు.. పెద్ద అంబర్‌పేటలో పోలీసుల కాల్పులు

Published on Fri, 07/05/2024 - 10:25

హైదరాబాద్‌, సాక్షి: పెద్ద అంబర్‌పేటలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చెలరేగింది. చోరీ చేసి పారిపోతున్న దోపిడీ ముఠాను పట్టుకునే నల్లగొండ పోలీసులు ఛేజింగ్‌కు దిగారు. ఈ క్రమంలో ఆ దొంగలు పోలీసులపైకి కత్తులు దూశారు. దీంతో పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చింది. 

నల్లగొండలో చోరీలు చేసిన ఓ ముఠా పారిపోతుండగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద పోలీసులు వాళ్లను వెంబడి అడ్డగించారు. ఆ టైంలో పోలీసులపై దుండగులు కత్తులు దూశారు. దీంతో వాళ్లను అదుపు చేసేందుకు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం నలుగురు గ్యాంగ్‌ సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని నల్లగొండకు తరలించారు. వీళ్లను పార్థీ(పార్థ) గ్యాంగ్‌కు చెందిన సభ్యులుగా భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నగరంలో ఈ మధ్య వరుసగా పోలీస్‌ ఫైరింగ్‌ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిలకలగూడలో మొబైల్ ఫోన్ స్నాచర్లపై, సైదాబాద్‌లో చైన్‌ స్నాచర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. అయితే తాజా ఘటన మాత్రం నగర శివారులో చోటు చేసుకుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)