Breaking News

పోలీసుల అదుపులో మోస్ట్‌ వాంటెడ్‌ ఉప్పల సతీష్‌

Published on Fri, 11/21/2025 - 20:46

హైదరాబాద్:  కోట్ల రూపాయిల మోసం కేసులో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న ఉప్పల సతీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల సతీష్‌ కోసం నెల నుంచి గాలిస్తున్న పోలీసులు.. ఎట్టకేలకు ముంబైలో అరెస్ట్‌ చేశారు. రూ. 23 కోట్ల రూపాయిల మోసం కేసులో ఉప్పల సతీష్‌ ప్రధాన నిందితుడు.  ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేసి వారిని మోసం చేసినట్లు ఉప్పల్‌ సతీష్‌పై అభియోగాలున్నాయి. 

అయితే నెలక్రితం సతీష్‌న ఎస్సై శ్రీకాంత్‌ గౌడ్‌ తప్పించాడు.  ఎస్‌ఐ శ్రీకాంత్‌ గౌడ్‌కు రెండు కోట్ల రూపాయిలు ఆఫర్‌ చేసినట్లు ఆరోపణులున్నాయి. దాంతో ఎస్‌ఐ శ్రీకాంత్‌ గౌడ్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. అనంతరం ఉప్పల సతీష్‌ కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ముంబైలో దొరికాడు.  సతీష్‌ను హైదరాబాద్‌కు తీసుకురానున్నారు పోలీసులు. 

కాగా, ఘరానా మోసగాడు సతీష్‌ను పట్టుకోవడం నుంచి అతడు పారిపోవడానికి సహకరించడం వరకు ప్రతి అంశంలోనూ టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించారు.  ముంబైలో సతీష్‌ ఆచూకీ కనిపెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడి కోసం ఎస్‌ఐ నేతృత్వంలో బృందాన్నిపంపారు.  అక్టోబర్‌ 23వ తేదీ రాత్రి సతీష్‌తో పాటు ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 ఆ వెంటనే వారి వద్ద ఉన్న దాదాపు ఎనిమిది సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి నిందితుల్ని పోలీసులు తమ వాహనంలోనే తరలిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు వారి చేతికి అందనీయరు. టాస్‌్కఫోర్స్‌ ఎస్‌ఐ మాత్రం తన బృందం ఉన్న కారును వదిలి నిందితులతో కలిసి వాళ్ల కారు ఎక్కారు. ఫోన్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేశాడు. ఈ వాహనాన్ని నిందితుడి డ్రైవరే నడిపారు.  

వీరిది ఎస్‌యూవీ వాహనం కాగా పోలీసులది పాత ఇన్నోవా. దీంతో ఈ రెండు వాహనాల మధ్య దూరం దాదాపు 40 కి.మీలకు చేరింది. షోలాపూర్‌లో నిందితులతో కలిసి భోజనం చేసిన ఎస్‌ఐ ఆ సమయంలోనూ తన బృందంతో మాట్లాడారు. వీరి వాహనం సదాశివపేట్‌ చేరడానికి  రెండు గంటల ముందే నగరం నుంచి మరో కారు వచ్చి అక్కడ సిద్ధంగా ఉంది. గత నెల 24వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సతీష్, ఎస్‌ఐ తదితరులు ప్రయాణిస్తున్న వాహనం సదాశివపేట్‌లోని ఓ దాబా వద్దకు చేరింది. అప్పటికే అక్కడ ఉన్న నగరం నుంచి వచ్చిన కారులో ఎక్కిన నిందితులు కొల్హాపూర్‌ వైపు పారిపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికి వెనుక వస్తున్న తన బృందానికి ఎస్‌ఐ సమాచారం ఇచ్చారు.  ఇలా ఉప్పల సతీష్‌ తప్పించుకుపోగా, తాజాగా మళ్లీ పోలీసులకు చిక్కాడు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు