Breaking News

డ్రగ్స్‌తో జీవితం అంధకారమే

Published on Sun, 06/30/2024 - 04:43

గచ్చిబౌలి (హైదరాబాద్‌): ‘చెడు స్నేహాల వల్ల నేను డ్రగ్స్‌కు బానిసనయ్యా. తల్లిదండ్రులు ఎంత చెప్పినా మారలేదు. చదువు మధ్యలోనే మానేశా. జీవితం అంధకారంగా మారిపోయింది. యువత డ్రగ్స్‌ బారిన పడొద్దు..’అంటూ నిట్‌ మాజీ విద్యార్థి నవీన్‌ నాయక్‌ చెప్పిన మాటలు ఆలోచింపజేస్తున్నాయి. వివరాలివి. హైదరాబాద్‌ బోయినపల్లికి చెందిన కురుమ్‌తోత్‌ రాథోడ్‌ నవీన్‌ నాయక్‌ (27) చదువులో చురుకుగా ఉండేవాడు. 2015లో ఆలిండియా 800వ ర్యాంక్‌ సాధింఛి ట్రిచి (తిరుచిరాపల్లి) ఎన్‌ఐటీలో చేరాడు. అయితే చెడు సహవాసాలతో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు.

విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతో నచ్చ చెప్పారు. అయినా పెడచెవిన పెట్టాడు. 2018లో చదువు మానేసి బెంగళూరులో మార్కెటింగ్‌ రంగంలో పని చేసినా ఆదాయం లేకుండా పోయింది. దీంతో డ్రగ్స్‌ పెడ్లర్‌గా మారాడు. ఈ క్రమంలోనే 2022లో ఎండీఎంఏ డ్రగ్‌ను వెంకటేళ్వర్లు అనే వ్యక్తికి సప్లయ్‌ చేయడంతో దుండిగల్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. 2023లో కేరళలోని పలక్కడ్‌ పీఎస్‌లో నమోదైన ఎన్‌డీసీఎస్‌ కేసులో శిక్ష పడింది. తాజాగా మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలో గంజాయి సేవించేందుకు వెళ్లి పోలీసులకు చిక్కాడు.

 ఒత్తిడిని అధిగమించాలి
విద్యార్థులు ఒత్తిడి పేరిట డ్రగ్స్‌కు బానిస కావద్దని, వ్యాయామం, యోగా లాంటివి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించాలని నవీన్‌ నాయక్‌ చెప్పాడు. భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశాడు. తల్లిదండ్రులు తనకెంతో చేశారని, వారు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి జీవితం నాశనం చేసుకున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడేళ్లుగా ఇంటికి వెళ్లడం లేదని చెబుతూ తల్లిదండ్రులను క్షమాపణ కోరాడు.  

ముగ్గురికి పాజిటివ్‌
మాదాపూర్‌లోని హైటెక్స్‌ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక పోలీసులతో కలిసి 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఎస్‌పీ సాయి చైతన్య తెలిపారు. దూద్‌ బౌలికి చెందిన డ్రగ్‌ పెడ్లర్‌ మోటికర్‌ సిచి్చతానంద్‌ అలియాస్‌ సచిన్‌ (28)తో పాటు గంజాయి సేవించిన కురుమ్‌తోత్‌ నవీన్‌ నాయక్, ప్రణీత్‌రెడ్డి, రాహుల్‌రాజ్‌ను అరెస్టు చేశామని చెప్పారు. మరో డ్రగ్‌ పెడ్లర్‌ ధూల్‌పేట్‌కు చెందిన రాజా పరారీలో ఉన్నాడన్నారు. శనివారం మాదాపూర్‌ డీసీపీ వినీత్‌తో కలిసి కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు.

ముగ్గురూ గంజాయి తాగినట్లు తేలిందని (పాజిటివ్‌) తెలిపారు. డ్రగ్స్‌ సేవించిన వారు తప్పించుకోలేరని, రక్తపు నమూనాల ఆధారంగా పట్టుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. పీజీ హాస్టళ్లలోనూ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్‌ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు కానీ, సేవిస్తున్నట్లు కానీ తెలిస్తే 8712671111 ఫోన్‌ నంబర్‌లో సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు రివార్డులు అందిస్తామన్నారు. కాగా మాదాపూర్‌ జోన్‌ పరిధిలో డ్రగ్స్‌పై నిఘా పెట్టినట్లు డీసీపీ వినీత్‌ తెలిపారు. యాంటీ డ్రగ్‌ కమిటీలు యాక్టివ్‌గా పని చేస్తున్నాయన్నారు. గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో గంజాయి డాన్‌ నీతూ బాయ్‌ ఆస్తులు అటాచ్‌ చేశామని, ఆమెపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో టీజీఏఎన్‌బీ డీఎస్‌పీ రమే‹Ù, మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లేష్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)