Breaking News

ఇంకా రహస్య ప్రదేశంలోనే ప్రణీత్‌ రావు!

Published on Tue, 03/12/2024 - 10:30

సాక్షి, హైదరాబాద్‌: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబీలోని హర్డ్‌ డిస్క్‌లు ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఎస్‌ఐబీలో కీలకంగా పనిచేసిన మాజీ ఐపీఎస్‌ ప్రభాకరరావు పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణకు సహకరించని ప్రణీత్‌రావు.. అధికారుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రణీత్‌రావు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రీట్రీవ్  చేయనున్నారు. ప్రణీత్‌ రావు ఎవరి ఫోన్లు టాపింగ్ చేశాడనే సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు.

ఫోన్ టాపింగ్ చేసిన వివరాలను ఎప్పటికప్పుడు ఓ ఉన్నతాధికారికి పంపినట్టు పోలీసులు గుర్తించారు. ఎస్ఐబీలో ప్రణీత్‌రావుకు ప్రభాకర్ రావు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు నోటీసులు ఇవ్వనున్న పంజాగుట్ట పోలీసులు విచారణ పిలవనున్నారు.

ప్రణీత్‌రావు కేసును సీఐడీకి లేదా సిట్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రావు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్ నంబర్లను టాపింగ్ చేసిన ప్రణీత్ రావు.. ప్రధాన ప్రతిపక్ష నాయకులు, వారి అనుచరుల కదలికలపై ప్రణీత్‌రావు బృందం నిరంతరం నిఘా పెట్టారు. హైదరాబాద్ నుంచి ఎవరు డబ్బులు తరలించిన ప్రణీత్‌రావుకి ముందే సమాచారం తెలిసేది.. ఆ జిల్లా పోలీసులకి ప్రణీత్ రావు ముందే సమాచారం అందిందేవాడని పోలీసులు గుర్తించారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)