Breaking News

పైశాచికత్వంపై కొరడా!

Published on Fri, 03/10/2023 - 04:20

అతనో డాక్టర్‌. విజయవాడ నుంచి ఢిల్లీ వెళుతూ ఆన్‌లైన్‌లో ఓ బాలిక పోర్న్‌ వీడియో చూశాడు. అంతటితో ఆగని వైద్యుడు వీడియోను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాలో ఉన్న తన ఫేక్‌ ఐడీ ద్వారా పబ్లిక్‌ డొమైన్‌లో షేర్‌ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వివరాలన్నింటినీ సేకరించిన పోలీసులు.. ఆ డాక్టర్‌ను అరెస్ట్‌ చేసేందుకు వెళితే ఆ తప్పు తాను చేయలేదంటూ బుకాయించాడు. తీరా సాక్ష్యాలు చూపించాక తోక ముడవగా నిందితుడిని కోర్టుకు తరలించారు. 

చిత్తూరు అర్బన్‌: రాష్ట్రంలో గత నెల వరకు 1,787 మంది పిల్లల పోర్న్‌(అశ్లీల) వీడియోలను పలు సామాజిక మాధ్యమాల్లో, స్నేహితులకు షేర్‌ చేశారు. చట్ట విరుద్ధమైన ఈ నేరానికి పాల్పడిన వాళ్లపై క్రిమినల్‌ కేసుల నమోదుకు  రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించుకుంది. ఇందులో భాగంగా నిందితుల వివరాలను 26 జిల్లాల ఎస్పీలకు అందజేయగా.. వాళ్లపై చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. నేష­నల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయి­టెడ్‌ చిల్డ్రన్‌(ఎన్‌సీఎంఈసీ).. అనేది అమెరికాకు చెందిన ఎలాంటి లాభాపేక్ష ఆశించని స్వచ్ఛంద సంస్థ. 2019లో ఈ సంస్థ మన­దేశంతో ఒప్పందం చేసు­కుంది.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో సహ­కారంతో ఇక్కడ పని­చేస్తోంది. ఈ సంస్థ తప్పి­పోయిన, అక్రమ రవా­ణా­కు గురైన పిల్లలతో పాటు లైంగిక దాడికి గురైన పిల్లల్ని సంరక్షిస్తుంది. అలాగే 18 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలకు సంబంధించిన అసభ్య వీడియోలు(పోర్న్‌) ఇంటర్‌నెట్‌ నుంచి తీసుకుని మరొకరికి చేరవేయడం, సామాజిక మాధ్యమాల ద్వారా షేర్‌ చేయడం వంటివి చేస్తే ఆ వీడియోలను తొలగించడంతో పాటు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది.

ఇలా దేశంలోని ప్రతి రాష్ట్రంలో జిల్లాల వారీగా వివరాలు సేకరించి కేంద్ర హోంశాఖ ద్వారా ఆయా రాష్ట్రాల హోంశాఖలకు పంపుతోంది. లింగ భేదంతో సంబంధం లేకుండా పిల్లల గోప్యత, హక్కులను కాలరాసే ఈ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్‌సీఎంఈసీ పంపిన వివరాల ఆధారంగా నిందితులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

అప్‌లోడ్‌ చేసినా, షేర్‌ చేసినా.. ఇక అంతే!
ప్రతి నెలా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న నిందితుల వివరాలను టిప్‌లైన్‌ సాంకేతిక వ్యవస్థతో కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర హోంశాఖకు అందుతోంది. ఒక టిప్‌లైన్‌లో ఏ వ్యక్తి ఏ తేదీన, ఏ సమయంలో, ఏ మొబైల్‌/కంప్యూటర్‌ నుంచి ఏ పోర్న్‌ వీడియోను ఆప్‌లోడ్‌ చేశాడు? ఎందులో షేర్‌ చేశాడు? ఏ స్థలం నుంచి పోర్న్‌ వీడియో అప్‌లోడ్‌ చేశాడు? ఆ చిత్రం ఎన్ని నిమిషాలు ఉంది? ఉపయోగించిన ఎలక్ట్రానిక్‌ పరికరం ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ అడ్రస్‌? అనే వివరాలను టిప్‌లైన్‌లో నిక్షిప్తమవుతున్నాయి.

దీనికి సంబంధించిన పూర్తి సాంకేతిక సాక్ష్యాలు కేంద్రం నుంచి రాష్ట్ర పోలీస్‌కు అందుతున్నాయి. పోలీస్‌ శాఖ దీన్ని జిల్లాల వారీగా విభజించి ఓ ఫైల్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో ప్రతి మూడు నెలలకోసారి ఈ అశ్లీల వీడియోలు షేర్‌ చేసే వారి వివరాలుంటాయి. గత నెల వరకు రాష్ట్రంలో 1,787 మంది ఈ నేరానికి పాల్పడ్డట్టు నివేదిక అందింది.

అత్యధికంగా గుంటూరులో 330, విశాఖ 270, ఎన్టీఆర్‌ విజయవాడ 238, కడప 126, నెల్లూరు 102, ప్రకాశం 94, అనంతపురం 90, తిరుపతి 77, శ్రీకాకుళం 70, చిత్తూరు 59, కాకినాడ 56, ప.గో 50, కర్నూలు 49, బాపట్ల 44, కృష్ణా 30, విజయనగరం 25, నంద్యాల 14, ఏలూరు 14, పల్నాడు 12, కోనసీమ 11, అన్న­మయ్య 10, సత్యసాయి 6, అనకాపల్లి 4, పార్వ­తీపురం 2, రాజమండ్రి 2, అల్లూరి సీతారామ­రాజు 2 మంది ఈ నేరాలకు పాల్పడ్డారు. కాగా,  ఇప్పటి­వరకు 680 మందిపై కేసులు నమోదయ్యాయి.  

శిక్షలు కఠినతరం  
ఈ కేసుల్లో కఠిన శిక్షలు విధించేలా చట్టాల్లో మార్పులు చేశారు. సాక్ష్యాధారాలు న్యాయస్థానంలో రుజువైతే మొదటిసారి ఐదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, రెండోసారి ఇదే తప్పు చేస్తే గరిష్టంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చని చట్టం చెబుతోంది.   
 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)