Breaking News

ఒక్క ఆధార్‌.. 11,000 సిమ్‌ కార్డులు!

Published on Wed, 04/05/2023 - 03:04

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలికి చెందిన మహేశ్వర్‌ (పేరు మార్చాం) ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగి. ఒక రోజు నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) అప్‌డేట్‌ చేసుకోవాలని, లేకపోతే బ్యాంకు ఖాతా బ్లాక్‌ అవుతుందని అతని సెల్‌ఫోన్‌కు సందేశం వచ్చింది. దీంతో నిజమేనని నమ్మిన మహేశ్వర్‌.. మెసేజ్‌లోని లింక్‌పై క్లిక్‌ చేసి, అందులో బ్యాంకు ఖాతా నంబరు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలు నమోదు చేశాడు. అంతే.. ఆ తర్వాత కొన్ని సెకన్లకే తన ఖాతాలో సొమ్ము విత్‌డ్రా అయినట్టు బ్యాంకు నుంచి సందేశం వచ్చింది.

అతను కంగారు నుంచి తేరుకునేలోపు ఖాతా మొత్తం ఖాళీ చేసేశారు సైబర్‌ నేరస్తులు. దీంతో లబోదిబోమంటూ సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి సందేశం వచ్చిన ఫోన్‌ నంబర్, దానికి అనుసంధానించిన గుర్తింపు కార్డును, బ్యాంకు ఖాతా వివరాలను సైబరాబాద్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ సైబర్‌ సేఫ్టీ (సీఓఈసీఎస్‌)లో విశ్లేషించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

సైబర్‌ మోసాలు, డేటా లీకు, నకిలీ వెబ్‌సైట్లు వంటి సైబర్‌ నేరాలకు సంబంధించిన కేసులను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఉన్న తెలంగాణ పోలీసులకు చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ సేఫ్టీ (సీఓఈసీఎస్‌) విశ్లేషిస్తుంటుంది. ఇదే క్రమంలో కేవైసీ మోసం కేసును కూడా విశ్లేషించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో కేవలం ఒక్క ఆధార్‌ కార్డు గుర్తింపుతో 11 వేల సిమ్‌ కార్డులు జారీ అయినట్లు సీఓఈసీఎస్‌ పోలీసులు గుర్తించారు. 

రెండు సిమ్‌లు నేరస్తుల చేతుల్లో.. 
సాధారణంగా కొత్త సిమ్‌కార్డు తీసుకోవాలంటే ధ్రువీకరణ పత్రంగా ఆధార్‌ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. టెలీకమ్యూనికేషన్‌ విభాగం (డీఓటీ) మార్గదర్శకాల ప్రకారం ఒక్క ఆధార్‌ కార్డుతో గరిష్టంగా 9 సిమ్‌ కార్డులను జారీ చేయవచ్చు. కానీ ఈ కేసులో థర్డ్‌ పార్టీ ఏజెన్సీలు డీఓటీ నిబంధనలను ఉల్లంఘించి ఏకంగా 11 వేలు సిమ్‌ కార్డులు జారీ చేశారు.

కాగా ఇందులో రెండు సిమ్‌ కార్డులను సైబర్‌ నేరస్తులు వినియోగించారని, ఈ ఫోన్‌ నంబర్ల నుంచే బాధితుడిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్‌ విభాగాన్ని సైబరాబాద్‌ పోలీసులు అప్రమత్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సిమ్‌ కార్డులను జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.      

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)