Breaking News

సందడిగా తిరిగి.. నీళ్లబకెట్‌లో పడి..

Published on Thu, 11/07/2024 - 11:10

ఖైరతాబాద్‌: రాత్రి 9 గంటలు.. ఇంట్లో కుటుంబసభ్యులంతా కలిసి భోజనం చేస్తున్నారు. ఏడాదిన్నర పాప తప్పటడుగులు వేస్తూ తిరుగుతుండగా తల్లి గోరుముద్దలు పెడుతోంది. చిన్నారి సందడికి అందరూ సంతోషంగా ఉన్నారు. అంతలోనే ఆ పాప బెడ్‌రూం బాత్‌రూంలోని నీళ్లబకెట్‌లో పడి విగతజీవిగా మారింది. ఖైరతాబాద్‌ ఏఎస్‌ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం... ఖైరతాబాద్‌ డివిజన్‌లోని ఐమా క్స్‌ ఎదురుగా ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో బి బ్లాక్‌ 307 ఫ్లాట్‌లో తోట సతీష్ కుమార్, రేణుక దంపతులు నివసిస్తున్నారు. 

ఈ ఫ్లాట్‌లో మొత్తం 12 మంది ఉంటున్నారు. సతీష్‌ గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికి ముగ్గురు సంతానం. ఏడాదిన్నర వయసున్న మూడో కూతురు ఆది్వక మంగళవారంరాత్రి ఇంట్లో తల్లి పెట్టే గోరుముద్దలు తింటూ సందడి చేస్తూ, తప్పటడుగులు వేస్తూ, అటు ఇటు తిరుగుతోంది. ఈ క్రమంలో తల్లి కూడా భోజనం ముగించుకొని 9.30 గంటలకు బెడ్‌రూంలో ఉన్న మొబైల్‌ ఫోన్‌ తీసుకునేందుకు వెళ్లగా అటాచ్‌డ్‌ బాత్‌రూం తలుపు తెరిచి ఉంది. 

అందులో ఉన్న నీళ్లబకెట్‌లో పాప కాళ్లు పైకి కనిపించడంతో తల్లి లబోదిబోమంటూ ఏడుస్తూ బయటికి తీసింది. కుటుంబసభ్యులు వెంటనే సమీపంలోని వాసవి హాస్పిటల్‌కు పాపను తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుల సూచన మేరకు రాత్రి 11 గంటల నిలోఫర్‌ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. కళ్ల ముందు ఆడుకుంటూ ఉన్న పాప అంతలోనే మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నా యి.

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)