Breaking News

కరెంటుషాక్‌తో ఒకరు.. భయంతో మరొకరు.. 

Published on Sun, 08/13/2023 - 03:29

కల్వకుర్తి టౌన్‌: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు నీటిగుంతలో కరెంటుషాక్‌కు గురై మరణించగా, మరొకరు భయంతో ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. కల్వకుర్తికి చెందిన అనిల్‌(18), రాజేశ్‌ వాటర్‌ప్లాంట్లలో ఆటోడ్రైవర్లు. తమ పనులు ముగిసిన తర్వాత కల్వకుర్తి తిమ్మనోనిపల్లి వద్ద ఉన్న నరసింహారెడ్డి వ్యవసాయ పొలంలోని నీటిగుంతలో ఈత కొట్టడానికి వెళ్లారు. పక్క పొలంలో ఉన్న కుర్మిద్దకు చెందిన శివ (22)ను సైతం ఈత కొట్టడానికి పిలిచారు. ముగ్గురు కలిసి నీటిగుంతలోకి దిగారు.

అయితే అది లోతుగా ఉండటంతో నీటిని బయటకు తోడేందుకు విద్యుత్‌ మోటారు ఏర్పాటు చేశారు. నీళ్లు తోడేస్తుండగా మధ్యలో కరెంట్‌ సరఫరా నిలిచిపోవడంతో వారు గుంతలోకి దిగి ఈత కొడుతున్నారు. కొద్దిసేపటికి కరెంటు సరఫరా కావడంతో అనిల్‌ విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో భయాందోళనకు గురైన శివ సమీపంలోని మరో వ్యవసాయ పొలంలో చెట్టుకు  ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)