Breaking News

ఉద్యోగం రావడంలేదని యువకుడి బలవన్మరణం

Published on Sun, 12/17/2023 - 05:25

డోర్నకల్‌: ఉద్యోగం రావడంలేదనే మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ పట్టణ శివారు ఎర్రమట్టితండాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. డోర్నకల్‌ సీఐ బి.ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రమట్టితండాకు చెందిన భూక్యా అనిల్‌ అలియాస్‌ విజయ్‌(23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే కొన్ని పోటీపరీక్షలకు హాజరైన అనిల్‌ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులకుతోడు ఉద్యోగం రావడం లేదన్న మనోవేదనలో ఉన్న అనిల్‌ శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మరునాడు ఉదయం కుటుంబసభ్యులు గమనించి చుట్టుపక్కల వెతకగా తండా సమీపంలోని ఓ వ్యవసాయబావిలో అనిల్‌ మృతదేహం లభ్యమైంది.

మృతదేహం నుంచి పురుగుమందు వాసన రావడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. ఉద్యోగం రాలేదనే బాధతోనే అనిల్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అనిల్‌ తండ్రి జయరాజ్‌ 20 ఏళ్ల క్రితమే అదృశ్యంకాగా, తల్లి, సోదరుడు ఉన్నారు. తల్లి కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనిల్‌ ఆత్మహత్యకు ముందు రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ వాట్సాప్‌లో చెక్కర్లు కొట్టింది. ఉద్యోగం రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో అనిల్‌ పేర్కొన్నాడు. కాగా, లేఖ విషయం తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)