Breaking News

చెల్లిని కాపాడబోయి నీట మునిగిన అక్క మృతి

Published on Sun, 06/09/2024 - 01:02

కమ్మర్‌పల్లి (నిజామాబాద్‌): వరద కాలువలో చెల్లెల్ని కాపాడబోయి అక్క నీట మునిగి మృతి చెందింది. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని గాం«దీనగర్‌లో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గాం«దీనగర్‌కు చెందిన చిత్తారి రాజు, మంజుల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కాలనీకి చెందిన పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీకి కామారెడ్డి నుంచి మంజుల తండ్రితోపాటు ఆమె సోదరి పానేటి శ్యామల కూడా వచ్చారు.

పంచాయితీ జరుగుతున్న సమయంలో మంజుల ‘నేను చనిపోతా’అంటూ పరుగెత్తికెళ్లి కాలనీకి పక్కనే గల కాలువ వద్దకు వెళ్లి అందులో దూకింది. చెల్లెల్ని కాపాడేందుకు శ్యామల, కాలనీ వాసులు కూడా కాలువ వద్దకు వెళ్లారు. శ్యామల ధైర్యం చేసి కాలువలోకి దూకింది. కాలనీ వాసులు చీరను విసరగా మంజుల దాన్ని పట్టుకొని పైకి వచ్చింది. కానీ శ్యామల ప్రమాదవశాత్తు కాలువలో మునిగిపోయి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, శ్యామల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)