Breaking News

వృద్ధురాలికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

Published on Mon, 10/07/2024 - 05:31

నూజివీడు : సైబర్‌ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన వృద్ధురాలు సైబర్‌ నేరగాళ్ల మోసానికి రూ.40 లక్షలు పోగొట్టుకు­న్నారు. నూజివీడు పట్టణంలోని ఉషాబాలా నగర్‌లో నివాసముండే మందపల్లి కమలా­జేసుదాసుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె బెంగళూరులో, చిన్న కుమార్తె, కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. కమలా­జేసుదాసు ప్రైవేటు నర్సింగ్‌ కాలేజీలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. 

ఈ నెల రెండో తేదీ మధ్యాహ్న సమయంలో 9850852151 నంబరు నుంచి ఓ మహిళ కమలా జేసుదాసుకు ఫోన్‌ చేసి.. తాము ముంబయి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరిట పార్శిల్‌ వచ్చిందని, అందులో ఎండీఎంఏ అనే నిషేధిత డ్రగ్స్‌ ఉందని చెప్పింది. మీకు మరో కాల్‌ వస్తుందంటూ కాల్‌ కట్‌ చేసింది. ఆ తర్వాత వెంటనే కమలా­జేసుదాసుకు 7831062545 నంబర్‌ నుంచి వీడియో కాల్‌ వచ్చింది.. తాము ముంబయి పోలీసులమని, మీకు డ్రగ్స్‌తో సంబంధం ఉందని, అమెరికాలో ఉన్న మీ కుటుంబ సభ్యులకూఇందులో సంబంధం ఉందంటూ భయపెట్టారు. 

ఈ డ్రగ్స్‌ ద్వారా వచ్చిన డబ్బు మీ ఖాతాలో ఉందని, మీరు ఏ తప్పూ చేయకుంటే ఆ డబ్బును తమకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని, ఏ తప్పూ లేకపోతే మీ డబ్బు మళ్లీ మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో భయపడిన వృద్ధురాలు ఈ నెల మూడో తేదీన రూ.20 లక్షలు, గంట తర్వాత రూ.10 లక్షలు, నాలుగో తేదీన మరో రూ.10 లక్షలు ఆర్‌టీజీఎస్‌ ద్వారా వారిచ్చిన ఖాతాలకు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. 

అనంతరం తనకు కాల్‌ వచ్చిన నంబర్‌కు ఆమె ఫోన్‌ చేస్తే.. అది పనిచే­యడం లేదు. దీంతో తాను మోసపో­యానని తెలు­సు­కున్న కమలా జేసుదాసు.. పట్టణ పోలీస్‌­స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టౌన్‌ సీఐ పి.సత్యశ్రీనివాస్‌ కేసు నమోదు చేశారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు