మీరు చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూశారు!

Published on Fri, 09/13/2024 - 04:34

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) పేరిట వచ్చే తప్పుడు లేఖలు, నోటీసులు నమ్మి మోసపోవద్దని ఐ4సీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ‘మీరు ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చూశారు..ఇది సైబర్‌ నేరం కిందకు వస్తుంది..మీరు వెంటనే మా నోటీసులకు స్పందించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుంది..’అని ఐ4సీ (ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌) సీఈఓ పేరిట సైబర్‌ నేరగాళ్లు నకిలీ నోటీసులు పంపుతున్నారు. 

మీరు చైల్డ్‌ పోర్న్‌ వీడియోలు చూసినట్టుగా మీ ఐపీ అడ్రస్‌ మా దగ్గర ఉందంటూ బెదిరిస్తున్నారు. విషయం తెలియక, ఈ బెదిరింపులకు హడలిపోయి ఎవరైనా వారిని సంప్రదిస్తే అప్పుడు అసలు మోసానికి తెరతీస్తున్నారు. కేసు నమోదు కాకుండా చూడాలంటే సూచించిన బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపాలని సైబర్‌ నేరగాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇవి అచ్చంగా నిజమైన అధికారుల నుంచే వచ్చినట్టుగా నమ్మించేలా ఈ నోటీసులను తయారు చేస్తున్నారు. 

ఇందులో సీబీఐ, ఇంటెలిజెన్స్‌ బ్యూరోల లోగోలు, అధికారుల పేరిట సంతకాలు, వాటి కింద స్టాంప్‌లు సైతం ఉంటున్నాయి. పోక్సో, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామంటూ ఆ నోటీసులలో పేర్కొంటున్నారు. ఇలా అచ్చంగా నిజమైనవిగా భ్రమింపజేసే నోటీసులతో సైబర్‌ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఐ4సీ అధికారులు వెల్లడించారు. అలాంటి లేఖలు, నోటీసులన్నీ ఫేక్‌ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇలాంటి నోటీసులకు స్పందించవద్దని, నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)