Breaking News

అయోధ్య ప్రసాదం.. వీఐపీ దర్శనం! 

Published on Wed, 01/24/2024 - 04:49

సాక్షి, హైదరాబాద్‌: అయోధ్య రామమందిరం పేరును సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసాలకు ఉపయోగించుకుంటున్నట్లు తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) హెచ్చరించింది. అయోధ్య ప్రసాదం పంపిణీ పేరిట, విరాళాల సేకరణ పేరిట, వీఐపీ దర్శనం టికెట్ల విక్రయం పేరిట సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌లలో సందేశాలు పంపుతున్నట్లు పేర్కొంది. అయోధ్య రామమందిరం పేరుతో సైబర్‌ నేరస్తులు పంపే క్యూఆర్‌ కోడ్‌లు, ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజ్‌ (ఏపీకే) ఫైల్స్‌ను నమ్మి మోసపోవద్దని టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్‌ షికా గోయల్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రామమందిరం పేరిట సైబర్‌ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చి నట్లు చెప్పారు. డబ్బు పంపాలంటూ వాట్సాప్‌ సందేశాల్లో నకిలీ లింక్‌లు పంపుతున్నారని, ఆ లింక్‌లు క్లిక్‌ చేసిన వారి నుంచి బ్యాంకుల వివరాలు, ఫోన్‌నంబర్లను సేకరిస్తున్నారని తెలిపారు. అలాగే వివిధ మొబైల్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసి ఓటీపీలు చెప్పాలని కోరుతున్నారని, అలా చేస్తే ఫోన్ల పనితీరు సైబర్‌ నేరగాళ్ల అ«దీనంలోకి వెళ్తుందని హెచ్చరించారు.

ఈ డిజిటల్‌ ముప్పును ఎదుర్కోవడానికి వాట్సాప్‌ లేదా ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని షికా గోయల్‌ సూచించారు. ఈ తరహా మెసేజ్‌లు వస్తే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. అదేవిధంగా www. cybercrime. gov. in  ద్వారా లేదా వాట్సాప్‌లో సైబర్‌ ఫ్రాడ్‌ రిజిస్ట్రీ నంబర్‌ 87126 72222కు సమాచారం ఇవ్వాలని సూచించారు. 

పాత నాణేలిస్తే లక్షలిస్తామని బురిడీ 
పాత నాణేలు తమకు ఇస్తే బదులుగా రూ. లక్షలు చెల్లిస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు మోసగిస్తున్నారని... ఇందిరా గాంధీ, భారతదేశ మ్యాప్‌ చిత్రాలున్న పాత రూ. 2 లేదా రూ. 5 నాణేలు పంపిస్తే రూ. లక్షల్లో ఆదాయం వస్తుందని మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ షికా గోయల్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

సైబర్‌ నేరగాళ్ల మాయలో చిక్కే అమాయకులకు డబ్బు చెల్లిస్తామని... అందుకోసం ముందుగా టీడీఎస్, సర్విస్‌ చార్జీలు చెల్లించాలంటూ కేటుగాళ్లు డబ్బు దండుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసాలపట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)