Breaking News

అమ్మ ప్రాణం తీసిన రూ.500

Published on Fri, 09/20/2024 - 04:13

పరిగి: గొడవ పడుతున్న కొడుకులను విడిపించేందుకు వెళ్లిన ఓ తల్లి ప్రాణం కోల్పోయింది. క్షణికావేశంతో మొదలైన చిన్నపాటి తగాదా ఆమె నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం సయ్యద్‌మల్కాపూర్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శంకరమ్మ (63)కు వెంకటయ్య, శ్రీను, సత్యమ్మ సంతానం. భర్త గతంలోనే మృతిచెందగా.. చిన్న కొడుకు శ్రీనుతో కలిసి ఉంటోంది. పెద్దకొడుకు వెంకటయ్య కుటుంబంతో సహా సమీపంలోని నజీరాబాద్‌ తండాలో జీవిస్తున్నాడు. 

ఇదిలా ఉండగా ఇటీవల శ్రీను అనారోగ్యం బారినపడ్డాడు. ఈ నేపథ్యంలో అన్న వెంకటయ్యకు ఫోన్‌ చేసి.. మహ్మదాబాద్‌కు చెందిన పసుపుల మల్లయ్య వద్ద రూ.5 వేలు తీసుకురమ్మని చెప్పాడు. డబ్బులు తీసుకొచ్చిన వెంకటయ్య వాటిని తమ్ముడికి ఇచ్చేందుకు బుధవారం రాత్రి భార్యతో కలిసి సయ్యద్‌మల్కాపూర్‌ వచ్చాడు. ఇదిలా ఉండగా అనారోగ్యం పాలైన తమ్ముడిని పరామర్శించేందుకు అక్క సత్యమ్మ సైతం వచ్చింది. అయితే రాత్రి వేళ అందరూ భోజనానికి సిద్ధమవుతుండగా.. అన్నదమ్ములిద్దరూ మద్యం తాగేందుకు కూర్చున్నారు. 

కొద్దిసేపటి తర్వాత అక్క సత్యమ్మ తనకు ఇవ్వాల్సిన రూ.500 ఇవ్వలేదని వెంకటయ్య వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీను తనను చూసేందుకు వచ్చిన అక్కను డబ్బులు అడుగుతావా అంటూ అన్నను నిలదీశాడు. ఇలా ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. డబ్బు తెచ్చిస్తానని సత్యమ్మ చెప్పినా అన్నదమ్ముల వాగ్వాదం ఆగలేదు. ఈ క్రమంలో ఇద్దరూ పెనుగులాడుతూ ఇంటి ఎదురుగా ఉన్న సీసీ రోడ్డుపైకి చేరుకున్నారు. కొడుకులు కొట్టుకుంటున్నారని గాబరాపడిన తల్లి శంకరమ్మ.. ఇరువురినీ విడిపించే ప్రయత్నం చేసింది. 

దీంతో సహనం కోల్పోయిన శ్రీను మధ్యలో నీవెందుకు వస్తున్నావంటూ తల్లిని తోసేయగా, సీసీ రోడ్డుపై పడిపోయింది. కుటుంబ సభ్యులు వచ్చి లేపేందుకు ప్రయత్నించగా చలనం కనిపించలేదు. చుట్టుపక్కల వాళ్లు 108కి ఫోన్‌ చేసి, అంబులెన్స్‌లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెద్ద కొడుకు వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)