Breaking News

భర్త అనుమానం.. పెను‘మంటలై’..

Published on Sun, 08/18/2024 - 05:24

రాయచోటి: భర్త అనుమానానికి తోడు.. వేధింపుల ధాటికి తట్టుకోలేక ఇద్దరు బిడ్డలతో సహా ఓ తల్లి సజీవదహనమైన హృదయవిదారక ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పలువురిని కంటతడి పెట్టించిన ఈ దారుణ ఘటన వివరాలను బంధువులు వెల్లడించారు. జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి హరిజనవాడకు చెందిన ఎర్రగుడి రాజా పది సంవత్సరాల కిందట గాలివీడుకు చెందిన గాలివీటి రమాదేవిని వివాహం చేసుకున్నారు. 

వీరికి మనోహర్‌ (8), మన్విత (5) సంతానం. జీవనోపాధి నిమిత్తం రాజా గల్ఫ్‌ దేశంలో ఉంటూ భార్య, పిల్లలను రాయచోటి పట్టణం బోస్‌నగర్‌ తొగటవీధిలో ఉంచాడు. భార్య రమాదేవి టైలరింగ్‌ చేసుకుంటూ ఇద్దరు పిల్లలను స్కూలుకు పంపుతూ జీవనం సాగించేది. రెండు సంవత్సరాలుగా భార్యపై అనుమానాన్ని పెంచుకున్న రాజా తను నివాసం ఉంటున్న ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో అనుమానం పెనుభూతమై వీడియో ఫోన్‌ ద్వారా వేధించేవాడు. 

వాటిని తట్టుకోలేక శనివారం ఉదయం ఆరుగంటలకు వంటగదిలో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి కన్నబిడ్డలు ఇద్దరినీ పట్టుకుని రమాదేవి (34) గ్యాస్‌బండకు నిప్పు అంటించి ఆ మంటల్లో ఆహుతి అయింది. ఇంటిలో నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆరి్పవేశారు. అప్పటికే మంటల్లో తల్లీ, ఇద్దరు పిల్లలు కాలిపోయారు. 

రమాదేవి సోదరుడు గాలివీటి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసినట్లు రాయచోటి అర్బన్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి మృతదేహాల వద్ద నివాళులు అర్పించారు. ఈ ఘటన దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)