Breaking News

ఓటీపీ లేకుండానే రూ.1.90 కోట్లు కొట్టేశారు

Published on Thu, 12/12/2024 - 04:21

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఓ మహిళ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఎలాంటి వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) లేకుండానే రూ.1.90 కోట్లను కేటుగాళ్లు కొట్టేశారు. బ్యాంకు నుంచి డబ్బు డెబిట్‌ అయినట్లు ఫోన్‌లో మెసేజ్‌ రాగానే ఆ మహిళ అప్రమత్తమై 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన ప్రమేయం లేకుండా ఈ ఘటన జరిగిందని తెలిపారు. 

1930 కాల్‌ సెంటర్‌లో ఏజెంట్‌ కాల్‌ రిసీవ్‌ చేసు కుని వెంటనే బ్యాంకింగ్‌ ఫాలోఅప్‌ బృందాన్ని అలర్ట్‌ చేశారు. రంగంలోకి దిగిన బృందం మహిళ బ్యాంకు అకౌంట్‌ నుంచి డబ్బు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో జమ అయినట్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాంకు అధికారులతో మాట్లాడి అక్కడున్న రూ.75,69,223లను స్తంభింప చేశారు. 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి మరో రూ.35 లక్షలు వివిధ బ్యాంకులకు బదిలీ అయినట్లు గుర్తించి ఆ బ్యాంకుల నిధులను కూడా హోల్డ్‌లో పెట్టించారు. ఈ విధంగా రూ.1.90 కోట్ల నిధుల్లో నుంచి రూ.1,10,70,000లను కేటుగాళ్ల నుంచి రికవరీ చేయగలిగినట్లు రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయల్‌ వెల్లడించారు. 

మిగిలిన రూ.79.30 లక్షల విషయంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించారు. సైబర్‌ క్రైమ్‌ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నవారు ఒకట్రెండు గంటల్లోనే (గోల్డెన్‌ హవర్స్‌) ఫిర్యాదు చేయాలని ఆమె ప్రజలకు సూచించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)