Breaking News

Divya Pahuja: ఎట్టకేలకు కాలువలో మృతదేహం లభ్యం

Published on Sat, 01/13/2024 - 15:02

గ్యాంగ్‌స్టర్‌ సందీప్ గడోలీ ప్రేయసి, మాజీ మోడల్‌ దివ్యా పహుజా మృతదేహాం లభించింది.హర్యానాలోని పటియాలో భాక్రా కెనాలో ఆమె మృతదేహాన్ని పోలీసులు శనివారం కనుగొన్నారు. భాక్రా కాలువ నుంచి గురుగ్రామ్‌, తోహ్నా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. ఆమెను గుర్తించేందుకు తన ఫోటోలను పహుజా కుటుంబ సభ్యులకు పంపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

కాగా జనవరి 1న దివ్యా పహుజా గురుగ్రామ్‌లోని టీ పాయింట్‌ హోటల్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే. యువతిని అయిదుగురు వ్యక్తులు హోటల్‌ గదిలోకి తీసుకెళ్లడం, అనంతరం హోటల్‌ యాజమాని మరికొందరు సాయంతో ఆమెను చంపేసి మృతదేహాన్ని లాక్కెళ్లి కారులోకి ఎక్కంచడం అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది.

అయితే హోటల్‌ ఓనర్‌ అభిజిత్‌ సింగ్‌కు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను దివ్య తన వద్ద ఉంచుకొని అతన్ని బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు తేలింది. వాటిని డిలీట్‌ చేయాలని కోరినా.. దివ్య అంగీకరించలేదని, ఈ క్రమంలోనే ఆమెను తలపై కాల్చి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. కాగా నిందితుల్లో ఒకరైన బాల్‌రాజ్‌ గిల్‌ విదేశాలకు పారిపోతుంటే కలకత్తా ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. మృతదేహాన్ని పటియాలాలోని భాక్రా కాలువలో పడేసినట్లు అంగీకరించాడు. ఇది హత్య జరిగిన గురుగ్రామ్‌లో 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

2016లో గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ఎన్‌కౌంటర్‌ కేసులో అతని గర్ల్‌ఫ్రెండ్‌ అయిన దివ్య పహుజా కూడా ప్రధాన నిందితురాలు.  ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్‌ను గురుగ్రామ్‌ పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి.  దివ్య పహుజా.. సందీప్‌ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ముంబై పోలీసులు దివ్యా పాహుజాతోపాటు  ఆమె తల్లి సోనియాను అరెస్ట్‌ చేశారు. దాదాపు ఏడేళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దివ్య.. గతేడాది జూన్‌లో బెయిల్‌పై విడుదలైంది. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)