Breaking News

మైనర్‌పై అత్యాచారం

Published on Mon, 09/02/2024 - 05:37

అవుకు: ఇంట్లో ఎవరూ లేని సమయం తెలుసుకున్న ఓ ప్రబుద్ధుడు తాగడానికి మంచినీళ్లు అడిగి... అదే అదునుగా మైనర్‌పై అత్యాచారం చేసిన ఘటన నంద్యాల జిల్లా, అవుకు మండల పరిధిలోని కాశీపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీపురం గ్రామానికి చెందిన మైనర్‌ కోవెలకుంట్ల పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ప్రభుదాసు అనే వ్యక్తి ఇదే పాఠశాల వ్యాన్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

రోజూ బాలిక ఇదే వ్యాన్‌లో ఊరికి వచ్చేది. ఆదివారం బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరనే విషయం తెలుసుకున్న నిందితుడు ఇంటి వద్దకు వెళ్లి బాలికను..మీ నాన్న ఇంట్లోలేడా అని అడిగి.. తాగేందుకు మంచినీళ్లు తీసుకురమ్మన్నాడు. బాలిక ఇంట్లోకి వెళ్లగానే నిందితుడు తలుపులు వేసి బాలికనోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఇంతలో బాలిక తల్లి ఇంటికి తిరిగి వచ్చి గేటు తీసింది. గేటు శబ్దం విన్న నిందితుడు బాలికను బెదిరించి మంచం కింద దాక్కున్నాడు. అప్పటికే భయాందోళనగా ఉన్న బాలిక తలుపులు తెరవగానే చెంపపై కాట్లు ఉండటంతో తల్లి ప్రశి్నస్తూనే నిందితుడిని గమనించింది. దీంతో కేకలు వేయగా, చుట్టుపక్కల వారు, బంధువులు బాలిక ఇంటికి వచ్చి నిందితుడిని కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)