Breaking News

పుట్టపర్తిలో భారీ చోరీ

Published on Fri, 08/23/2024 - 05:32

పుట్టపర్తి అర్బన్‌: పుట్టపర్తి సమీపంలోని కర్ణాటక నాగేపల్లి వద్ద ఉన్న సాయి సందీప్‌ విల్లాస్‌–2లో భారీ చోరీ జరిగింది. పుట్టపర్తి రూరల్‌ సీఐ సురేష్, ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు... సాయి సందీప్‌ విల్లాస్‌–2లోని 40 నంబర్‌ ఇంట్లో పుట్టపర్తి వ్యవసాయాధికారి వెంకట బ్రహ్మం, కొత్తచెరువు అగ్రి ల్యాబ్‌ ఏవో శ్రీవాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారు బుధవారం రాత్రి తమ ఇంట్లోని పై అంతస్తు గదిలో నిద్రించారు. అర్ధరాత్రి వేళ కింద హాలులో చప్పుడు రావడంతో వెంకట బ్రహ్మం కిందకు వచ్చి చూడగా, ఇంటి తలుపు తెరిచి ఉంది. బెడ్‌ రూంలోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. 

ఆయన వెంటనే అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పుట్టపర్తి ‘దిశ’ డీఎస్పీ శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. శ్రీనివాసరావు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ కృష్ణమూర్తి వచ్చి దొంగల కోసం చుట్టపక్కల వెదికినా కనిపించలేదు. గురువారం ఉదయం రూరల్‌ సీఐ సురేష్‌ ఘటనాస్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు. 

ఏడో తరగతి చదువుతున్న తమ కూతురుకు ప్రతి జన్మదినం రోజున బహుమతిగా ఒక బంగారు నగ చేయిస్తామని, ఆ విధంగా చేయించిన లాంగ్‌ చైను, పూసల దండ, డాలర్‌లు, కమ్మలు, చైన్లు కలిపి మొత్తం 37 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేలు నగదును దొంగలు అపహరించారని వెంకట బ్రహ్మం, శ్రీవాణి దంపతులు తెలిపారు. దొంగలు పక్కాగా రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

విల్లాస్‌లో ప్రవేశించిన దొంగలు తొలుత ఓ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారని, ఆ ఇంట్లో ఏమీ లభించకపోవడంతో పక్కనే ఉన్న వెంకట బ్రహ్మం ఇంట్లో చోరీ చేశారని గుర్తించారు. కాగా, దొంగలు విల్లాస్‌లోకి ప్రవేశించే సమయంలో అదే కాలనీలో ఉన్న ఒకతను గుర్తించి సెక్యూరిటీని అప్రమత్తం చేశారని, అయినా ఉపయోగం లేకపోయిందని స్థానికులు చెబుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)