Breaking News

వివాహేతర సంబంధం: రాత్రికి ఇంటికి వెళ్లాడు.. ఉదయం లేచి చూస్తే..

Published on Sun, 05/22/2022 - 10:45

సాక్షి,నెల్లూరు(క్రైమ్‌): వివాహిత తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రామచంద్రాపురంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. బాలాజీనగర్‌లోని చీపురుకట్ట సంఘానికి చెందిన సంపూర్ణ (28) సుమారు 11 ఏళ్ల క్రితం అదే ప్రాంతంలో టీ మాస్టర్‌గా పనిచేస్తున్న వేణును ప్రేమ వివాహం చేసుకున్నారు. నవాబుపేట రామచంద్రాపురంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి సంజన, జయశ్రీ కుమార్తెలు. పొదలకూరురోడ్డులోని ఓ పెట్రోల్‌ బంక్‌లో సేల్స్‌గర్ల్‌గా ఆమె పనిచేస్తున్నారు. మనస్పర్థల నేపథ్యంతో సంపూర్ణ, వేణు మూడేళ్ల క్రితం విడిపోయారు. 

అప్పటి నుంచి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉండసాగారు. ఆటోడ్రైవర్‌ ఆమె ఇంటికి శుక్రవారం రాత్రి వచ్చివెళ్లారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ సంపూర్ణ నిద్ర లేవలేదు. దీంతో కుమార్తెలు అమ్మమ్మ జయమ్మకు సమాచారం అందించారు. ఆమె హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకొని కుమార్తెను నగరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందారని నిర్ధారించారు. మృతురాలి మెడపై చిన్నపాటి గాయం ఉంది. ఈ క్రమంలో అనుమానాస్పద మృతిగా కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ మేరకు నవాబుపేట ఎస్సై వీరనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: Elderly Couple In Tirupati: ఎంగిలిపేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)