Breaking News

భర్త వేధింపులు తట్టుకోలేక..

Published on Sat, 12/14/2024 - 08:28

మియాపూర్‌: మనస్పర్థలు, కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్‌ సీఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా చత్రి మండలం చిత్తాపూర్‌ గ్రామానికి చెందిన మొక్కపాటి వెంకట నాగలక్ష్మి(28) వివాహం భీమవరానికి చెందిన సామినేని సతీష్ తో 2018లో జరిగింది. వీరికి 2019లో కుమార్తె జన్మించింది. కొద్ది రోజుల తర్వాత వారు విడిపోయారు. 2023 నవంబర్‌లో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కుమార్తె  వెంకటనాగలక్ష్మి దగ్గరే ఉంటుంది. నాగలక్ష్మి కూతురుతో కలిసి మియాపూర్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది.

ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 22న నాగలక్ష్మి ఏలూరు జిల్లా తోచిలుక గ్రామానికి చెందిన మువ్వా మణికంఠ మనోజ్‌ను రెండవ వివాహం చేసుకుంది. మనోజ్‌ సివిల్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరిగాయి. నాగలక్ష్మి పేరుపై ఉన్న వ్యవసాయ భూమిని మనోజ్‌ తన పేరుపై నమోదు చేయాలని, బ్యాంక్‌ అకౌంట్‌కు తన ఫోన్‌ నంబర్‌ను యాడ్‌ చేయించాలని ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ పాస్‌వర్డ్‌లు చెప్పాలని  తరచూ వేధిస్తుండేవాడు. ఇటీవల కాలంలో రెండుసార్లు ఆమెను విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. 

మనస్తాపం చెందిన నాగలక్ష్మి గత నెల 28వ తేదీన ఆన్‌లైన్‌లో గడ్డిమందు ఆర్డర్‌ చేయగా ఈ నెల 4వ తేదీ డెలివరీ అయ్యింది. కాగా బుధవారం మనోజ్, నాగలక్ష్మిల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నాగలక్ష్మి భర్త మనోజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)