Breaking News

మహిళ దారుణ హత్య

Published on Sat, 06/08/2024 - 13:19

నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లిలో శుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కొన్నాళ్లుగా వేధిస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడగా ఆయన కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించి వివరాలు... బైరవునిపల్లి గ్రామానికి చెందిన కోళ్ల సైదమ్మ(47)తో ఆమె భర్త దూరంగా ఉంటుండగా, సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓప్రైవేట్‌ పాఠశాల హాస్టల్‌లో వార్డెన్‌గా పనిచేస్తోంది.

 ప్రస్తుతం సెలవులు కావడంతో స్వగ్రామమైన బైరవునిపల్లి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సొంటి శ్రీను తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమెను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లి కొట్టినట్లు తెలిసింది. ఈనేపథ్యాన శుక్రవారం కూడా సైదమ్మ ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకున్న శ్రీను వెళ్లి గొడవకు దిగాడు. ఆమె తనను నిరాకరించిందన్న కోపంతో ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో మూడు చోట్ల బలంగా పొడిచాడు. 

ఆపై చేతులను కత్తితో ఇష్టానుసారంగా కోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైదమ్మ రక్తపు మడుగులో పడి పోయింది. దీంతో స్థానికులు ఆమెను నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా శ్రీను సైతం అదే కత్తితో పొడుచుకోగా పేగులు బయటకు రావడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆయనను ఖమ్మం తరలించగా పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉండగా, సెలవుల్లో ఇంటికి రాకుండా కోదాడలో ఉన్నా బతికేదని వారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

భారీ బందోబస్తు
హత్య జరగడంతో బైరవునిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సైదమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు హత్య చేసిన శ్రీను కోసం గ్రామంలో గాలించారు. కానీ ఆయన సైతం ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుసుకున్న వారు ఆగ్రహంతో ఉండగా.. ఎలాంటి ఘటనలు జరగకుండా ఖమ్మం రూరల్‌ సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యాన నేలకొండపల్లి, ముదిగొండ ఎస్సైలు తోట నాగరాజు, నరేష్, సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)