Breaking News

పువర్తి క్యాంప్‌పై మావోల మెరుపుదాడి

Published on Sun, 09/15/2024 - 04:44

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టు అగ్రనేత మడకం హిడ్మా స్వగ్రామమైన పువర్తిలో సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో అడవిలో నక్కిన మావోయిస్టులు.. క్యాంప్‌పైకి రాకెట్‌ లాంచర్లు ప్రయోగించారు.

అయితే ఇవి క్యాంప్‌ వెలుపల జవాన్ల సంచారం లేని చోట పడటంతో ప్రాణనష్టం తప్పింది. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. సుమారు గంటన్నరపాటు తుపాకులు, బాంబుల మోతతో పువర్తి అటవీ ప్రాంతం దద్దరిల్లింది. శుక్రవారం రాత్రంతా జవాన్లు అప్రమత్తంగా గడిపారు. శనివారం క్యాంప్‌ సమీప అడవుల్లో కూంబింగ్‌ చేపట్టారు.  

చొచ్చుకుపోతున్న బలగాలు 
దాడులు చేయడంలో దిట్టగా పేరొందిన హిడ్మా సొంతూరిలో గత ఫిబ్రవరి 18న భద్రతా దళాలు క్యాంప్‌ ఏర్పాటు చేశాయి. వివిధ దళాలకు చెందిన వేలాది మంది జవాన్లు కేవలం వారం రోజుల్లోనే యుద్ధప్రాతిపదికన ఈ క్యాంప్‌ ఏర్పాటు చేసి మావోయిస్టులకు గట్టి హెచ్చరిక పంపారు. అంతేకాక పువర్తిలో ఉన్న స్తూపాలను ధ్వంసం చేశారు. హిడ్మా సమావేశాలు నిర్వహించే ఇంటిని తమ అదీనంలోకి తీసుకున్నారు. 

ఆ తర్వాత బస్తర్‌ అడవుల్లో వరుసగా చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 150 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కోవర్టు ఆరోపణలతో ఈ ఏడాది పది మందిని మావోయిస్టులు హతమార్చారు. ఈ తరుణంలో మావోయిస్టు పార్టీలో అభద్రతా భావం నెలకొందని, తెలంగాణ కేడర్‌కు చెందిన నేతలను హిడ్మా నమ్మడం లేదనే ప్రచారం మొదలైంది. 

కవ్వింపు చర్య?: వరుస నష్టాల నుంచి తేరుకుని, భద్రతా దళాలను ఆత్మరక్షణలో నెట్టే లక్ష్యంతో మావోయిస్టులు పువర్తి క్యాంప్‌పై దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. రాత్రివేళ వ్యూహాత్మకంగా క్యాంప్‌పై దాడి చేసి, అక్కడున్న భద్రతా దళాలను చెదరగొట్టడంతోపాటు తమకు పట్టున్న అటవీ ప్రాంతంలోకి రప్పించి అంబుష్‌ దాడి చేసేందుకు యత్నించినట్టు సమాచారం. అందులోభాగంగానే భారీ సంఖ్యలో జవాన్లు మోహరించిన క్యాంప్‌పై రాకెట్‌ లాంచర్లు ప్రయోగించి కవ్వింపు చర్యలకు దిగారని తెలుస్తోంది. 

అయితే రాత్రంతా క్యాంప్‌ లోపలే ఉండడం ద్వారా మావోలు పన్నిన ఉచ్చులో జవాన్లు చిక్కుకోలేదని చెబుతున్నారు. జేగురుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో 8 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. 

ఘటనాస్థలి నుంచి బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌–226(గాదిరాస్, సుక్మా జిల్లా) క్యాంప్‌లో పనిచేస్తున్న అస్సాంకు చెందిన జవాన్‌ విపుల్‌ భయాన్‌ తన సరీ్వస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)