Breaking News

మావోయిస్టు పార్టీ అగ్రనేత సుజాత అరెస్టు?

Published on Thu, 10/17/2024 - 05:27

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్‌ మైనా అలియాస్‌ కల్పన అలియాస్‌ ఝాన్సీ అలియాస్‌ పద్మను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 67 ఏళ్ల సుజాత వైద్య చికిత్స నిమిత్తం బస్తర్‌ అడవులను వీడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా హైదరాబాద్‌ వెళ్తుండగా పక్కాగా అందిన సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. 

పోలీసు అధికారులు మాత్రం ఈ విషయం ధ్రువీకరించడం లేదు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, అదంతా మీడియాలో వస్తున్న ప్రచారమని చెబుతున్నారు. దీంతో సుజాత నిజంగానే అరెస్టయ్యారా? లేక లొంగిపోయారా? అనే అంశంపై స్పష్టత కరువైంది. ఈమెపై కేంద్ర ప్రభుత్వం రూ.కోటి రివార్డు ప్రకటించింది. 

లొంగుబాటుకు ప్రయత్నాలు? 
సుజాత వయోభారంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని, సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు చేరుకుని అక్కడ తనకున్న పరిచయాల ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు ఇటీవల దండకారణ్యం, అబూజ్‌మఢ్‌ అడవుల్లో పోలీసులు, భద్రతా దళాల నిర్బంధం పెరిగిపోయింది. ఇంకోవైపు వయోభారం, అనారోగ్యం సమస్యలతో సుజాత ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. 

ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్యం కోసం తెలంగాణలోకి వస్తుండగా పోలీసులు అరెస్టు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండురోజుల కిందటే సుజాతకు సంబంధించిన పక్కా సమాచారం పోలీసులకు అందినట్టు సమాచారం.   

కిషన్‌జీతో వివాహం? 
మహబూబ్‌నగర్‌కు చెందిన సుజాత డిగ్రీ చేయడానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌తో పరిచయం అయింది. క్రమంగా విప్లవ భావాల వైపు ఆకర్షితురాలైంది. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా విప్లవ బాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు మహిళలు ఇప్పటికే వివిధ ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. సుజాత దాదాపు 43 ఏళ్లు నక్సలైట్‌/మావోయిస్టు పార్టీల్లో పని చేశారు. 

పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీతో సుజాతకు వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కిషన్‌జీ పదిహేనేళ్ల కిందట అప్పటి కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రి చిదంబరానికి నేరుగా సవాల్‌ విసిరిన మావోయిస్టుగా సంచలనం సృష్టించారు. పదమూడేళ్ల కిందట ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)