అది ఒకప్పటి వీడియో, రాజీనామా చేసేది లేదు..

Published on Fri, 07/21/2023 - 08:04

ఇంఫాల్:  మణిపూర్లో  ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో దారుణంగా విఫలమయ్యారంటూ ప్రతిపక్షాలు మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి. ఎప్పుడో జరిగిన సంఘటనకు ఇప్పుడు రాజీనామా చెయ్యమంటే ఎలా అని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.  

మే 4న జరిగిన మణిపూర్ అల్లర్లలో ఒక చీకటి అధ్యాయం వెలుగు రావడానికి చాలా ఆలస్యమైంది. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న రోజునే ఆనాటి వీడియో బయటకి రావడంతో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. అందులోని అమానవీయ సంఘటన చూసి దేశమంతా నివ్వెరపోయింది. పార్లమెంటు సమావేశాలు మొదటిరోజే అట్టుడికింది. ఇది కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యమేనని వేలెత్తి చూపుతూ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ అల్లర్లను నియంత్రించడంలో విఫలమైన కారణంగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తున్నట్లు ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. 

కానీ ఈ ఊహాగానాలన్నిటినీ ప్రభుత్వ వర్గాలు కొట్టి పారేశాయి. ప్రభుత్వ వర్గాలు ఈ డిమాండ్లపై స్పందిస్తూ అది ఒకప్పటి వీడియో అని ఇప్పుడు మణిపూర్లో పరిస్థితి చాలా వరకు సర్దుకుంది శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని చెప్పుకొచ్చాయి. మణిపూర్ హోమ్ మంత్రి కుకీ తెగ వారితో చర్చించారని వారికి సత్వర న్యాయం చేకూరేలా చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.      

కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను మెయిటీ వర్గం వారు నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన రెండు నెలల క్రితమే జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పటివరకు నిందితులను అదుపులోకి తీసుకోకపోవడాన్ని ప్రతిపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి. బుధవారం ఈ ఉదంతం వెలుగులోకి రాగానే మణిపూర్ ప్రభుత్వం, పోలీసు వర్గాలు అప్రమత్తమై వీడియో ఆధారంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డ నలుగురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చదవండి: భారీ వర్షాలు.. పసిబిడ్డను ఎత్తుకొని రైలు దిగిన తండ్రి, పట్టుతప్పడంతో

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)