Breaking News

గెలిచింది 5 కోట్లు.. పోగొట్టుకుంది 58 కోట్లు.. 

Published on Sun, 07/23/2023 - 11:22

ముంబై: మహారాష్ట్రలోని నాగ్​పూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆన్‌లైన్‌లో జూదమాడి 5 కోట్లు సంపాదించాడు. తక్కువ సమయంలో కూర్చున్న చోట కూర్చుని ఉండగానే కోట్లు కొల్లగొట్టడంతో ఇదేదో బాగుందనిపించి అదేపనిగా గ్యాంబ్లింగ్ ఆడాడు. ఇంకేముంది చూస్తుండగానే 58 కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. 

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగ్​పూర్‌కు సమీపంలోని గొండా సిటీకి చెందిన అనంత్ అలియాస్ శొంటు నవరతన్ జైన్ బాధితుడైన వ్యాపారస్తుడికి గ్యాంబ్లింగ్ లో ఆనతి కాలంలోనే కోట్లు గడించవచ్చని ఆశ చూపించాడు. మొదట్లో వెనకడుగు వేసిన వ్యాపారి తరవాత ఎందుకో నవరతన్ జైన్ ప్రలోభానికి లొంగిపోయాడు. వెంటనే జైన్ కు హవాలా ద్వారా రూ.8 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. జైన్ వ్యాపారికి వాట్సాప్లో ఒక లింకు పెట్టగా దాని ద్వారా తన అకౌంట్లో రూ. 8 లక్షలు డిపాజిట్ అయినట్టు చూపించింది. 

దీంతో వ్యాపారికి ఆశతో పాటు నమ్మకం కూడా కలిగింది. ఆలస్యం చేయకుండా వెంటనే గ్యాంబ్లింగ్ ఆడటం ప్రారంభించాడు. మొదట్లో హస్తవాసి కలిసొచ్చి 5 కోట్లు లాభం సంపాదించాడు. అక్కడ వరకు అంతా బాగానే సాగింది. సరిగ్గా అప్పుడే మొదలైంది అసలు జూదం. ఒక్కొక్కటిగా సంపాదించిన ప్రతి రూపాయి వెనక్కి పోవడం మొదలైంది. పోయిన రూపాయిని తిరిగి రాబట్టుకోవాలన్న అతడి తాపత్రయం ఏకంగా 58 కోట్లు నష్టపోయేలా చేసింది.

ఎంత ఆడినా జూదం కలిసిరాకపోవడంతో విసుగు చెందిన వ్యాపారి నవరతన్ జైన్ ను కలిసి తన డబ్బు తనకు తిరిగివ్వాలని కోరాడు. అతడు నిరాకరించడంతో చేసేదేమీ లేక తమకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు. వెంటనే గొండా సిటీలోని నిందితుడి ఇంటికి వెళ్ళేసరికే జైన్ పారిపోయాడని.. ఇల్లంతా సోదా చేయగా 14 కోట్లు నగదు నాలుగు కేజీల బంగారు బిస్కెట్లు దొరికినట్లు తెలిపారు పోలీసులు. వారంతా దుబాయ్ పారిపోయి ఉండవచ్చని చెబుతున్నారు పోలీసులు.  

 గ్యాంబ్లింగ్ కారణంగా ఎందరో జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. అయినా కూడా ఏదో ఒక మూల అదృష్టదేవత కనికరించక పోతుందా అన్న చిన్న నమ్మకంతో అనేకులు ఈ మహమ్మారి బారిన పతున్నారు. అదృష్టం సంగతి అటుంచితే ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయిన సందర్భాలే ఎక్కువ.   

ఇది కూడా చదవండి: మణిపూర్‌ అరాచకపర్వంలో మరో ఘోరం..  

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)