Breaking News

ఏపీలో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు.. యువతి మృతి, మరొకరికి గాయాలు

Published on Mon, 12/09/2024 - 10:09

సాక్షి, తూర్పుగోదావరి: ప్రేమ పేరుతో కొందరు ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తమను ప్రేమించలేదనే కారణంగా యువతులపై దాడులకు తెగబడుతున్నారు. ఏపీలో ఒకేరోజు రెండు చోట్ల దాడి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.

తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల గ్రామంలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. గుర్రాల రాజు(23) అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురిచేశారు. కొద్దిరోజులుగా ఆమె వెంట పడుతూ తనను ప్రేమించాలని వేధించాడు. ఈ క్రమంలో బాధితురాలు పట్టించుకోకపోవడంతో ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆమెపై దాడి చేసేందుకు బాధితురాలి ఇంటికి వెళ్లాడు. యువతిపై దాడి చేసే సమయంలో ఆమె తల్లి అడ్డురావడంతో కోపంతో.. ఆమెపై దాడి చేశాడు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కాగా, దాడి చేసిన తర్వాత రాజు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అలాగే, నిందితుడు రాజు కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

ఇక, నంద్యాల జిల్లాలో కూడా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్‌కు  చెందిన ఇంటర్ విద్యార్థిని తాను ప్రేమిస్తున్నానంటూ రాఘవేంద్ర వేధింపులకు గురిచేశాడు . అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)