Breaking News

డ్రైవింగ్‌లోనే గుండెపోటుకు గురై.. 

Published on Wed, 05/31/2023 - 01:54

రాజేంద్రనగర్‌: పశువుల దాణా లోడ్‌తో వస్తున్న ఓ లారీ డ్రైవర్‌ గుండెపోటుకి గురై స్టీరింగ్‌పైనే మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. కర్నూల్‌ జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ కె.నర్సింహ్మ(49) సోమవారం రాత్రి పశువుల దాణాతో లారీని తీసుకొని నగరానికి బయలుదేరాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శంషాబాద్‌ ప్రాంతానికి చేరుకున్నాడు.

ఆ సమయంలో తన భార్య నాగలక్ష్మికి ఫోన్‌ చేసి ఛాతీలో నొప్పిగా ఉందని, వాహనాన్ని నడపలేకపోతున్నానని చెప్పాడు. దీంతో భార్య కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని చెప్పగా.. అలాగేనంటూ వాహనంతో ముందుకు కదిలాడు. గగన్‌పహాడ్‌ ఓవర్‌ బ్రిడ్జి దాటిన అనంతరం ఏజీ వర్సిటీ సబ్‌ రోడ్డు వద్దకు రాగానే గుండెనొప్పి తీవ్రం కావడంతో స్టీరింగ్‌పైనే పడి మృతి చెందాడు.

లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టి పుట్‌పాత్‌పైకి ఎక్కి నిలిచిపోయింది. కారు ఎయిర్‌బెలూన్‌లు తెరుచుకోవడంతో కారులో ఉన్న డ్రైవర్‌ రమేష్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)