Breaking News

డేరా బాబా జైల్లో తక్కువ.. బయట ఎక్కువ.. 

Published on Fri, 07/21/2023 - 08:59

చండీగఢ్: డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు తాజాగా మరోసారి 30 రోజుల పెరోల్ లభించింది. తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం, ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసుల్లో బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 2017లో తీర్పు వెలువడి నాటి నుండి ఆయన హర్యానాలోని రోహ్‌తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శిక్షాకాలంలో తరచుగా పెరోల్ పై వెళ్తూ రావడం చేస్తున్నారు. గడిచిన మూడేళ్ళలో బాబా గుర్మీత్ మొత్తం ఆరు సార్లు బయటకు వెళ్లి రాగా ఇది ఏడో సారి కావడం గమనార్హం.   

జనవరిలో చివరిసారిగా పెరోల్ పై వచ్చిన డేరా బాబా సుమారు 40 రోజులు బయట గడిపారు. ఆ వ్యవధిలో బాబా ఆన్లైన్ లో సత్సంగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అదే సమయంలో తన పుట్టినరోజు వేడుకల్లో కత్తితో కేకును కట్ చేసి ఐదేళ్ల తర్వాత ఇలా పుట్టినరోజుని జరుపుకుంటున్నానని ఇలాంటి పుట్టినరోజులు కనీసం అయిదు జరుపుకోవాలని వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. 

హర్యానా ముఖ్యమంత్రి కూడా ఆరోజు మాట్లాడుతూ బాబా బెయిల్ గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ ఆయన బెయిల్ పై వచ్చినా కూడా అది పద్దతి ప్రకారమే జరుగుతుంది కదా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలలు తిరగకుండానే మళ్ళీ అతడికి బెయిల్ మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డేరా బాబా విషయంలో కోర్టుకు హర్యానా ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.     

ఇది కూడా చదవండి: అది ఒకప్పటి వీడియో, రాజీనామా చేసేది లేదు..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)