Breaking News

భూ కబ్జాకు రైతు బలి

Published on Thu, 08/08/2024 - 05:53

ఖమ్మం రూరల్‌: భూమి కబ్జా చేశారనే ఆవేదన కు తోడు పోలీసులు సైతం కబ్జాదారులకే కొ మ్ము కాస్తున్నారనే ఆక్రందనతో ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలిలా.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం జాన్‌బాద్‌ తండాకు చెందిన ఏలేటి వెంకటరెడ్డి(50)కి అర ఎకరం, ఆయన సోదరుడు భూపాల్‌రెడ్డికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో 25 గుంటలకు సంబంధించి వివాదం నెలకొనగా.. అదే గ్రామానికి చెందిన జాటోతు వీరన్న ఆక్రమించాడని వెంకటరెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ వెంకటరెడ్డి ఈనెల 4న పురుగు  మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవా రుజామున మృతి చెందాడు. 

సెల్ఫీ వీడియోలో ఏముందంటే... 
వెంకటరెడ్డి ఆత్మహత్యకు ముందు తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో రికార్డు చేశాడు. ‘మా భూమి ఆక్రమించుకుని జాటోతు వీరన్న సాగు చేస్తుండగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పోలీసులు ఆయన వద్ద లంచం తీసుకుని మమ్మల్నే ఇబ్బందిపెడుతున్నారు. మాజీ ఎంపీటీసీ కళింగరెడ్డి ప్రోద్బలంతో జాటోతు వీరన్నతోపాటు సురేష్, దేవిక, చిన్ని, ఉపేందర్‌ మమ్మల్ని వేధిస్తున్నారు. వారం క్రితం ప్రైవేట్‌ కేసు వేయించినా మాకు న్యాయం జరగ లేదు’అని వీడియోలో వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇదే భూవివాదంలో వెంకటరెడ్డి సోదరుడు ఏలేటి భూపాల్‌రెడ్డి కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు తెలిపారు. కాగా, వెంకటరెడ్డి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు జాటోతు వీరన్న, మాజీ ఎంపీటీసీ కళింగరెడ్డి, సురే‹Ù, దేవిక, చిన్ని, ఉపేందర్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రామారావు తెలిపారు.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)