Breaking News

ఇంటర్‌ విద్యార్థి విషాదాంతం.. చదవడం ఇష్టం లేక గోదావరిలో దూకాడు

Published on Wed, 08/09/2023 - 13:10

దండేపల్లి: కాలేజీలో దింపేందుకు తీసుకెళ్లిన తండ్రి వద్దనుంచి కరీంనగర్‌ బస్టాండ్‌లో తప్పించుకున్న ఓ ఇంటర్‌ విద్యారి్థ...మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరినదిలో శవమై తేలాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

దండేపల్లికి చెందిన నానవేని మల్లేశ్‌ కుమారుడు నానవేని ప్రశాంత్, అలియాస్‌ గట్టు(19) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు. మంగళవారం అతన్ని కాలేజీలో దింపేందుకు తండ్రి మల్లేశ్‌ కరీంనగర్‌ బయల్దేరాడు. 

కరీంనగర్‌ బస్టాండులో దిగగానే ప్రశాంత్‌ తప్పించుకున్నాడు. కొద్దిసేపు బస్టాండులో అతనికోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. కాలేజీకి వెళ్లి ఆరా తీయగా, కాలేజీకి రాలేదని చెప్పారు. దీంతో ఇంటికే వచ్చాడేమో అని తండ్రి దండేపల్లికి రాగా..ఇంటికి కూడా రాలేదని కుటుంబసభ్యులు చెప్పడంతో ప్రశాంత్‌ను వెదికేందుకు బయటికి వెళ్లాడు.

ఇంతలో సాయంత్రం గూడెం గోదావరినదిలో శవం ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లి చూడగా, అది ప్రశాంత్‌ది కావడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రశాంత్‌ను గతేడాది దండేపల్లి జూనియర్‌ కాలేజీలో చేరి్పంచగా ఫెయిల్‌ అయ్యాడు. 

అతన్ని ఆ కాలేజీ నుంచి తీసి, ఈయేడాది కరీంగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చేరి్పంచారు. చదవడం ఇష్టం లేకనే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబీకులు, బంధువులు భావిస్తున్నారు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)