Breaking News

నవరంగ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడికి జనసేన బెదిరింపు 

Published on Sun, 04/07/2024 - 03:01

తాడేపల్లి రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయడానికి వీలు లేదంటూ జనసేన పార్టీ నేతలు తనను బెదిరించి బీఫామ్‌ పత్రాలు లాక్కున్నారని నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్‌ జలీల్‌ ఖాన్‌ ఆరోపించారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి తన తలపై గన్‌ పెట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా తాడే­పల్లి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో షేక్‌ జలీల్‌ఖాన్‌ మాట్లాడారు.

జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గ్లాసు, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తు బకెట్‌ రెండూ ఒకే పోలి­కతో ఉండటంతో తనను 15 రోజులుగా జనసేన నేతలు బాలÔౌరి, నాదెండ్ల మనోహర్‌ బెదిరిస్తున్నారని ఆరోపించారు. రూ.5 కోట్లు ఇస్తామని, బీఫామ్‌లు తమకిచ్చేయాలని బాలÔౌరి ఒత్తిడి చేశారన్నారు. రెండుసార్లు ఇదే విషయమై జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడించారని చెప్పారు.

తాను ఒప్పుకోకపోవడంతో జనసేన కార్యకర్తలతో చంపిస్తామని మనోహర్‌ బెదిరించారన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి విజయవాడ ఐలాపురం హోట­ల్‌ వద్ద ఉన్న తనను వల్లభనేని బాలÔౌరి గన్‌ పెట్టి బెదిరించారన్నారు. తన వద్ద ఉన్న నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ బీఫామ్‌లు లాక్కున్నారని వాపోయారు.  

పవన్‌ నీచ రాజకీయాలు
బీజేపీతో కలసి మైనార్టీలను అణగదొక్కేందుకు పవన్‌ నీచ రాజకీయాలు చేస్తున్నారని జలీల్‌ ఖాన్‌ మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌పై పిఠాపురంలోనూ  తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో బాలÔౌరిపైన, ఆయనకు సహకరించిన పవన్, మనోహర్‌పైనా ఫిర్యాదు చేశామన్నా­రు.

కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తా­నని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని మైనార్టీలను సర్వనాశనం చేసిన చంద్రబాబుతో జతకట్టిన పవన్‌కు రాష్ట్ర ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)